Israel: భారతీయుడి మృతి వెనుక అంతులేని విషాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్‌పై (Israel) జరిగిన క్షిపణి దాడిలో భారతీయుడి మృతి.. ఆ కుటంబంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. మృతుడు కేరళకు చెందిన మ్యాక్స్‌వెల్‌గా గుర్తించారు. మ్యాక్స్‌వెల్‌కు ఇప్పటికే ఐదేళ్ల కుమార్తె (Daughter) ఉండగా.. భార్య ఏడు నెలల గర్భవతిగా (Pregnant wife) ఉంది. రెండు నెలల క్రితమే మ్యాక్స్‌వెల్ పనుల నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లాడు. క్షిపణి దాడిలో ఇలా ప్రాణాలు కోల్పోవడంతో కుటంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పుట్టబోయే బిడ్డను చూడకుండానే ఇలా అర్థాంతరంగా ప్రాణాలు పోవడంతో బంధువులు కున్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మ్యాక్స్‌వెల్ స్వస్థలం కొల్హాంలోని కైకులంగారా. వ్యవసాయం క్షేత్రంలో పని చేసేందుకు రెండు నెలల క్రితమే ఇజ్రాయెల్ వెళ్లారు. ఆయన భార్య రెండోసారి ఏడు నెలల గర్భిణి. ఆ జంటకు ఇప్పటికే ఐదేళ్ల కుమార్తె కూడా ఉంది. మ్యాక్స్‌వెల్‌కు ప్రమాదం జరిగిందని.. సోమవారం సాయంత్రం తమ కోడలు ఫోన్ చేసి చెప్పిందని… అర్ధరాత్రికి కుమారుడి మరణవార్త తెలిసిందని మ్యాక్స్‌వెల్ తండ్రి విలపించారు. మ్యాక్స్‌వెల్ మృతదేహం నాలుగు రోజుల్లో భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది. ఇదే దాడిలో మరో ఇద్దరు గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ఈ దాడి హెజ్‌బొల్లా పనేనని అనుమానిస్తున్నారు. హమాస్‌కు మద్దతుగా ఈ గ్రూప్ అక్టోబర్ 8 నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలపై రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దీనికి ప్రతీకారంగా హెజ్‌బొల్లా స్థావరాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది.
ఇదిలా ఉంటే కేరళ వాసి మృతితో భారత్ అప్రమత్తమైంది. భారతీయులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతమున్న భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసే, పర్యటించే భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది.
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి