ఒమన్ రాజధాని మస్కట్‌లోని షియా మసీదు సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక భారతీయుడు మరణించగా.. మరొకరు గాయపడ్డారని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దక్షిణ గాజా నగరమైన రఫాపై దాడి చేయవద్దని అమెరికా, ఇతర దేశాలు ఒత్తిడి చేస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. రఫాలో పాలస్తీయన్ ప్రజలు ఖాళీ చేయాలని, సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని మరోసారి ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది.
ఇజ్రాయెల్‌పై జరిగిన క్షిపణి దాడిలో భారతీయుడి మృతి.. ఆ కుటంబంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. మృతుడు కేరళకు చెందిన మ్యాక్స్‌వెల్‌గా గుర్తించారు. మ్యాక్స్‌వెల్‌కు ఇప్పటికే ఐదేళ్ల కుమార్తె ఉండగా.. భార్య ఏడు నెలల గర్భవతిగా ఉంది.