ముంబైలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. అంతేకాకుండా.. భారీ వర్షం కురిసింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో.. ముంబై వాసులు వేడి నుండి ఉపశమనం పొందారు. కాగా.. ఈ సీజన్‌లో ముంబైలో ఇది మొదటి వర్షపాతం కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. మెట్రోపాలిటన్ యొక్క స్కైలైన్ మురికి గాలులతో చుట్టుముట్టింది. దీంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.