నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు.. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి చేస్తున్నారు. ఇందులో కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. శ్రీలీల కీలకపాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ పై మరింత అంచనాలు పెంచేశాయి. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు.
భగవంత్ కేసరి తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ క్రమంలో తాజాగా ఈ గురించి ఆసక్తికర విషయం ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది… ఈ సినిమాలో కేజీఎఫ్ బ్యూటి శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే యాక్షన్ డ్రామా కాకుండా.. బాబీ, బాలయ్య కాంబోలో ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఎమోషనల్ డ్రామా అని టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ చిత్రంలో పాలిటిక్స్ నేపథ్యంలో ఓ ప్లాష్ బ్యాక్ ఉంటుందట. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ మూవీలో ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్నారు..
ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2018లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ తో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి నే పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.. కేజీఎఫ్ సినిమాలు సూపర్ హిట్ అయిన ఆ తర్వాత పెద్దగా అవకాశాలు కలిసి రాలేదు.. ఒక్కసినిమాను కూడా అనౌన్స్ చెయ్యలేదు.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది..