Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
- కరకరలాడే స్ట్రీట్ స్టైల్ వడలు
- సింపుల్ పదార్థాలు – సూపర్ టేస్ట్
- క్రిస్పీకి స్పెషల్ చిట్కాలు
- ఈజీగా ఇంట్లోనే తయారీ
సాయంత్రం వేళ వేడివేడిగా ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మసాలా వడ. బండి మీద దొరికే మసాలా వడలు పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా భలే రుచిగా ఉంటాయి. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ చిట్కాలతో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
- పచ్చి శనగపప్పు – 1 కప్పు
- ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు (చిన్నగా తరిగినవి)
- పచ్చిమిర్చి – 2 లేదా 3 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
- అల్లం ముక్క – చిన్నది
- వెల్లుల్లి రెబ్బలు – 4 నుండి 5
- జీలకర్ర – 1 టీస్పూన్
- కరివేపాకు, కొత్తిమీర – తగినంత
- ఉప్పు – రుచికి సరిపడా
- నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం:
1. పప్పు నానబెట్టడం:
ముందుగా ఒక కప్పు పచ్చి శనగపప్పును శుభ్రంగా కడిగి, కనీసం 2 నుండి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పు బాగా నానితేనే వడలు పైన క్రిస్పీగా వస్తాయి. ఒకవేళ సమయం లేకుంటే వేడి నీటిలో 30 నుంచి 40 నిమిషాలు నానబెట్టాలి.
VDxSHOURYUV : రౌడీ స్టార్ కోసం నేచురల్ స్టార్..విజయ్-నాని సందడి!
2. పప్పు గ్రైండింగ్:
నానబెట్టిన శనగపప్పు నుండి 2 టేబుల్ స్పూన్ల పప్పును పక్కన పెట్టుకోవాలి (ఇది వడలకు మంచి లుక్ ఇస్తుంది). మిగిలిన పప్పులోని నీరు పూర్తిగా వడకట్టి, మిక్సీ జార్లో పప్పుతో పాటు అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు వేసి నీరు పోయకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, పిండి మరీ మెత్తగా అవ్వకూడదు.
3. మిశ్రమాన్ని కలుపుకోవడం:
గ్రైండ్ చేసిన పప్పు మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో ముందుగా పక్కన పెట్టిన పచ్చి పప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి , రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
Tamanna Simhadri: తల్లి కాబోతున్న ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి: అసలు కుదురుతుందా?
4. వడలు వేయడం:
బాణలిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత, పిండిని చిన్న, చిన్న సైజులో తీసుకుని అరచేతిపై పెట్టి వడల్లా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా ఒత్తుకుంటే లోపల కూడా బాగా ఉడుకుతాయి.
5. వేయించడం:
మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచి వడలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మీద వేయిస్తే పైన రంగు వస్తుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది.
అంతే..! ఎంతో రుచికరమైన, కరకరలాడే స్ట్రీట్ స్టైల్ మసాలా వడలు రెడీ. వీటిని అల్లం చట్నీతో లేదా టమోటా కెచప్‌తో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Centre Releases Rs 1,805.24 Crore to AP: ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ.1,805.24 కోట్లు విడుదల
-
New Airport: ఏపీ ప్రజలకు శుభవార్త.. 5000 ఎకరాల్లో అతి పెద్ద ఎయిర్ పోర్ట్..
-
CM Revanth Reddy : కాళేశ్వరం నుంచి మేడిగడ్డ వరకు.. సీఎం రేవంత్ ఫుల్ ఫోకస్.!
-
Kolkata Knight Riders: 7 మ్యాచ్ లలో 1 విజయం.. KKR ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందా? రెస్ట్ ఆఫ్ సీజన్ సీనారియోలు
ట్రెండింగ్
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!