VDxSHOURYUV : రౌడీ స్టార్ కోసం నేచురల్ స్టార్..విజయ్-నాని సందడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న #VDxSHOURYUV నేడు పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ వేడుకకు నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టడం విశేషం. అయితే సినిమా ప్రారంభానికి ముందే విడుదలైన “That’s A Roar” పోస్టర్ వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. “No crown, I still walk like a king” (కిరీటం లేకపోయినా.. రాజులాగే నడుస్తా) అనే పవర్‌ఫుల్ లైన్ విజయ్ మేనరిజానికి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. ప్రేమ నుండి కోపానికి, కోపం నుండి శక్తికి మారే ప్రయాణాన్ని ఈ సాంగ్ అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ సినిమాను ‘వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్’ గ్లోబల్ ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దుతోంది. దీని కోసం అంతర్జాతీయ స్థాయిలో పేరున్న టెక్నీషియన్లను రంగంలోకి దించారు:
Also Read:Chiranjeevi: “గుండె ఎడమ వైపు కాదు.. కుడి వైపు! ‘చిరంజీవి’ మూవీ షాకింగ్ కాన్సెప్ట్!
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
అలెజాండ్రో మార్టినెజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి ఎరిక్ డర్స్ట్ విజువల్ ఎఫెక్ట్స్, సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైన్ అలానే హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. విజయ్ తన చేతుల్లో కుక్కపిల్లలను పట్టుకుని ధైర్యంగా ముందుకు నడుస్తుంటే, వెనుక సాయుధ దళాలు అనుసరించడం చూస్తుంటే ఇదొక వినూత్నమైన ‘మైథలాజికల్-స్టైల్’ యాక్షన్ డ్రామా అనిపిస్తోంది. ‘కింగ్‌డమ్’ సినిమా మిశ్రమ ఫలితాన్ని ఇచ్చినప్పటికీ, ఈ కొత్త ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఒక గట్టి ‘కమ్‌బ్యాక్’ అయ్యేలా కనిపిస్తోంది. https://x.com/NTVJustIn/status/2046171991062016071?s=20
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!