Supreme Court: వైసీపీకి బిగ్ రిలీఫ్.. నామినేషన్ల అడ్డంకులపై సుప్రీం సీరియస్.. కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది.. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులకు ఎదురవుతున్న అడ్డంకుల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఎస్ఈసీ) ఆదేశించింది. నామినేషన్లు వేసే అభ్యర్థులకు తగిన పోలీసు భద్రత కల్పించాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా వారు నామినేషన్లు దాఖలు చేసే వాతావరణాన్ని కల్పించాలని స్పష్టం చేసింది.
మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు అడ్డుకున్నారంటూ వైసీపీ పిటిషన్ వేసింది.. అర్బన్ లోకల్బాడీల్లో నామినేషన్ దాఖలుకు గడువు పొడిగించాలని.. నామినేషన్ కేంద్రాల దగ్గర ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలని.. ఏకగ్రీవ ఎన్నికపై స్టే ఇవ్వాలని తన పిటిషన్లో విజ్ఞప్త చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈ నేపథ్యంలో నామినేషన్ల గడువును మరో రెండు రోజుల పాటు పొడిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే అభ్యర్థుల జాబితా ప్రచురణను ఈ నెల 25వ తేదీ వరకు వాయిదా వేయాలని సూచించింది. నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా పోలీసులు, ఎన్నికల అధికారులు వ్యవహరించాలని పేర్కొంది.
Also Read
- CM Chandrababu: పోలీసుల త్యాగాలకు సెల్యూట్.. ధైర్యంతో పాటు మానవత్వం అవసరం..
- Supreme Court: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల వివాదంపై సుప్రీంకు వైసీపీ.. నేడు సీజేఐ ధర్మాసనం విచారణ
- AP MPTC, ZPTC Elections 2026: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు
- CM Chandrababu : రీల్స్ నుంచి బయటకు రండి.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు, ఎలాంటి ఒత్తిళ్లు, అడ్డంకులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసే పరిస్థితులు ఉండాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఎన్నికల సంఘం ఈ మొత్తం ప్రక్రియను గట్టిగా పర్యవేక్షించాలని, జారీ చేసిన ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వుల అమలుకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాలని ఎస్ఈసీని కోరింది. నామినేషన్ల దాఖలును అడ్డుకుంటున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు మౌనంగా ఉండలేదని పేర్కొంది. న్యాయసమీక్షాధికారం కింద ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘానికి తగిన ఆదేశాలు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని గుర్తుచేసింది.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగడం అత్యంత కీలకమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ, భయరహిత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అవసరమైన సందర్భాల్లో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ కోసం రాజ్యాంగ న్యాయస్థానాలు తగిన ఆదేశాలు జారీ చేస్తాయని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు..
తాజావార్తలు
-
Supreme Court: వైసీపీకి బిగ్ రిలీఫ్.. నామినేషన్ల అడ్డంకులపై సుప్రీం సీరియస్.. కీలక ఆదేశాలు
-
AP Municipal Elections: విజయవాడ టీడీపీలో టికెట్ చిచ్చు.. బుద్ధా వెంకన్న ఇంటి వద్ద ఉద్రిక్తత
-
SBI Cyber Attack: ఎస్బీఐ ఖాతాదారుల డేటా డార్క్ వెబ్‌లో లీక్.. 3,897 మందిపై ప్రభావం!
-
Trump: గత ఒప్పందాల కంటే భిన్నంగా ఉంటుంది.. భారత్-అమెరికా వాణిజ్యంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Madakasira: మడకశిర జనసేన అభ్యర్థి ఎంపికలో అనూహ్య పరిణామం… నామినేషన్ తిరస్కరణతో మారిన సీన్..
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!