AP Municipal Elections: విజయవాడ టీడీపీలో టికెట్ చిచ్చు.. బుద్ధా వెంకన్న ఇంటి వద్ద ఉద్రిక్తత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Municipal Elections: విజయవాడలో తెలుగుదేశం పార్టీకి చెందిన టికెట్ ఆశావహుల అసంతృప్తి ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఇంటి వద్ద 52వ డివిజన్ కార్పొరేటర్ టికెట్ విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. తనకు టికెట్ కేటాయించలేదని టీడీపీ నాయకుడు కొప్పుల గంగ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బుద్ధా వెంకన్న అనుచరులు, గంగ అనుచరుల మధ్య కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది. గత 25 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నప్పటికీ బీ ఫారం ఇస్తామని చెప్పి మోసం చేశారని కొప్పుల గంగ ఆవేదన వ్యక్తం చేశారు.. వైసీపీ నుంచి వచ్చిన వారికి టికెట్లు కేటాయిస్తున్నారని ఆయన విమర్శలు చేశారు. తనకు సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారని బుద్ధా వెంకన్నపై గంగ అనుచరులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరోవైపు, ఎంపీ కేశినేని చిన్ని 17 మంది అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసి అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోయారు. ఇదే సమయంలో 52వ డివిజన్ టికెట్ విషయంలో అసంతృప్తి మరింత పెరిగింది. తనకు బీ ఫారం ఇవ్వలేదనే ఆవేదనతో కొప్పుల గంగ బండరాయితో దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనతో బుద్ధా వెంకన్న ఇంటి వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే, పొత్తులో భాగంగా 52వ డివిజన్ సీటు భారతీయ జనతా పార్టీకి కేటాయించినట్లు బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. కొప్పుల గంగకు టికెట్ రాలేదన్నది వాస్తవమేనని ఆయన పేర్కొన్నారు. పొత్తుల కారణంగా ఆ సీటును బీజేపీకి ఇవ్వాల్సి వచ్చిందని వివరించారు. ఈ సందర్భంగా కొప్పుల గంగకు బుద్ధా వెంకన్న హామీ ఇచ్చారు. 52వ డివిజన్ టికెట్ దక్కనప్పటికీ, అంతకంటే పెద్ద పదవిని ఇప్పిస్తానని మాట ఇచ్చారు. ఈ హామీతో టికెట్ వివాదం ఏ మలుపు తిరుగుతుందనేది స్థానిక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
Also Read
- Kanaka Durga Temple: పూర్ణాహుతితో ముగిసిన శరన్నవరాత్రులు.. నేడు దుర్గమ్మ జలవిహారం
- AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
- Mydukur Election Suspended: మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు రద్దు.. ఎస్ఈసీ కీలక ప్రకటన
- AP Local Body Elections 2026: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ ఫోకస్.. సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో కీలక భేటీ
తాజావార్తలు
-
AP Municipal Elections: విజయవాడ టీడీపీలో టికెట్ చిచ్చు.. బుద్ధా వెంకన్న ఇంటి వద్ద ఉద్రిక్తత
-
SBI Cyber Attack: ఎస్బీఐ ఖాతాదారుల డేటా డార్క్ వెబ్‌లో లీక్.. 3,897 మందిపై ప్రభావం!
-
Trump: గత ఒప్పందాల కంటే భిన్నంగా ఉంటుంది.. భారత్-అమెరికా వాణిజ్యంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Madakasira: మడకశిర జనసేన అభ్యర్థి ఎంపికలో అనూహ్య పరిణామం… నామినేషన్ తిరస్కరణతో మారిన సీన్..
-
Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం భగవంత్ మాన్కు అవమానం.. ఆప్ ఆగ్రహం
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!