Bombay High Court: ఇంటిపనులు చేయమని పెళ్లి అయిన మహిళకు చెప్పడం క్రూరత్వం కిందకు రాదని, పనిమనిషి చేసే పనితో పోల్చడం సరికాదని బాంబే హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ బెంచ్ వెల్లడించింది. విడిపోయిన భర్తతో పాటు అతని తల్లిదండ్రులపై ఓ మహిళ పెట్టిన కేసులను న్యాయస్థానం కొట్టివేసింది. మహిళ తన ఫిర్యాదులో పెళ్లిన కొద్ది కాలం వరకు బాగానే చూసుకున్నారని అనంతరం పనిమనిషిలా చూడటం ప్రారంభించారని చెప్పారు. కారు కొనుక్కునేందుకు రూ. 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతోపాటు మానసికంగా, భౌతికంగా ఎంతో వేధించాడని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Filmmaker Arrested: భార్యను కారుతో ఢీకొట్టిన బాలీవుడ్ సినీ నిర్మాత అరెస్ట్
ఈ కేసును విచారించిన కోర్టు పెళ్లి అయిన మహిళను పని చేయమని అడిగారంటే అది కచ్చితంగా కుటుంబం కోసమే అవుతుందని తెలిపింది. దానిని పనిమనిషి చేసే పనితో పోల్చడం సరికాదని పేర్కొంది. ఇంటి పనులు చేయడం ఆమెకు ఇష్టం లేకుంటే ఆ విషయాన్ని పెళ్లికి ముందే చెప్పి ఉండాల్సిందని న్యాయమూర్తులు జస్టిస్ విభా కంకణ్‌వాడి, జస్టిస్ రాజేశ్ పాటిల్ వ్యాఖ్యానించారు. తనను మానసికంగా, భౌతికంగా వేధించారని ఫిర్యాదుదారు ఆరోపించినప్పటికీ అందుకు తగిన ఆధారాలను చూపించలేకపోయారని పేర్కొన్న కోర్టు.. ఐపీసీ సెక్షన్ 498ఎ ఈ కేసుకు వర్తించదని స్పష్టం చేస్తూ భర్త, అతడి తల్లిదండ్రులపై పెట్టిన గృహహింస కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.