మాస్టర్ మహేంద్రన్ హీరోగా, రాకేష్ మాధవన్ తెరకెక్కించిన చిత్రం ‘నీలకంఠ’. యష్న ముతులూరి, నేహా పఠాన్ హీరోయిన్లుగా నటించగా.. స్నేహా ఉల్లాల్ కీలక పాత్రలో నటించారు. ఎం.మమత, ఎం.రాజరాజేశ్వరి సమర్పణలో మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా నూతన సంవత్సరం కానుకగా జనవరి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా వచ్చిన నీలకంఠ భారీ హిట్ అందుకుంది. మొదటి రోజే కోటి రూపాయల కలెక్షన్ అందుకుని.. రూరల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సినిమా హిట్ అయిన సందర్భంగా శనివారం చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
Also Read : South Cinema : 40 ఏళ్ల తర్వాత సౌత్ ఇండియా నుండి సైలెంట్ ఫిల్మ్
హీరో మహేంద్రన్ మాట్లాడుతూ.. మొదటగా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ చిత్ర నిర్మాతలు మమ్మల్ని ఎక్కడా ఇబ్బంది పడనీయకుండా ఇప్పటి వరకు చాలా బాగా చూసుకున్నారు. నేను ఎప్పుడూ ఒకటే చెబుతూ ఉంటాను.. నేను ఒక పెద్ద యాక్టర్ కావాలని అనుకోవడం కంటే, ఎప్పుడూ నిర్మాతలకు అనుకూలంగా ఉండే ఒక ప్రొడ్యూసర్స్ యాక్టర్ గా ఉండాలని కోరుకుంటాను. ఎప్పుడు ఒక ఆర్టిస్ట్ వచ్చి ఒక సినిమాతో గెలవడు.. అలా నా లైఫ్‌లో నీలకంఠ ఇచ్చిన నిర్మాతలను ఎప్పుడు మర్చిపోను. ఇక దర్శకుడు రాకేష్ తన కన్ఫిడెన్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. షూటింగ్ స్పాట్‌లో ఏడ్చి ఏడ్చి నా దగ్గర షాట్స్ తీసుకునేవాడు. ఆడియోన్స్ థాంక్యూ. మీరెచ్చిన 100 రూపాయిలకు చాలా చాలా థ్యాంక్స్. ప్రెస్ అండ్ మీడియా ఎక్కడ ఏం జరిగినా కానీ.. ఎక్కడో ఓ ములన జరిగిన హీరోను తీసుకువచ్చి జనాల ముందు నిలబెట్టే స్థానంలో మీరు ఉన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనిల్ మాట్లాడుతూ… ‘మీడియాకు ధన్యవాదాలు. మా సినిమా మొదటి నుంచి మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు. మా టీం అందరం చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ.. మెట్టు మెట్టు ఎక్కుతూ ఇక్కడి వరకు వచ్చాం. ఈ సినిమా కోసం 10 ఏళ్లు కష్టపడ్డాం. మా చిన్న చిన్న ఆనందాలు, సరదాలు కోల్పోతేనే నేను ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కరు మంచి ప్రొడ్యూసర్, బ్యానర్ దొరికితే హిట్ కొడదామనే అనుకుంటారు. కానీ మాకున్న చిన్న చిన్న సమస్యల వల్ల మంచి సినిమా మాత్రమే తీయగలుగుతాం. ఈ సినిమా మొదటిరోజు వన్ సీఆర్ వచ్చింది. టికెట్స్ ఎక్కువ తెగకపోయినా.. మాకొక టికెట్ అవుతుంది. మాకు ఇంకా థియేటర్స్ దొరికితే నీలకంఠ సినిమా ఇంకా బాగా ఆడుతుంది. మేము 100 శాతం ఇచ్చామని చెప్పట్లేదు కానీ .. ఈ సినిమా ఓ మంచి పుస్తకం లాంటిది. మాకు సరిగా థియేటర్స్ దొరకలేదు, డిస్టిబ్యూటర్స్ సప్పోర్ట్ చేయలేదు. ఈ సినిమాను మీరు తీసుకోవాలనుకుంటే.. మీకు నచ్చిన అమౌంట్ ఇవ్వండి. ఈ సినిమాతో కోట్లు సంపాదించాలన్నది మా టార్గెట్ కాదు.. నీలకంఠ అందరికీ చేరువవ్వాలి.
నిర్మాత శ్రీనివాసులు మాట్లాడుతూ ‘మా సినిమాను ప్రమోట్ చేసిన మీడియాకు థాంక్స్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వల్లే ఈ సినిమా చేశాం. మ్యూజిక్ డైరెక్టర్ మేము అనుకున్న దానికి నాలుగింతలు చేశాడు. హీరో గారికి నేను పెద్ద ఫ్యాన్. ఆయన యాక్టింగ్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా హీరోగా పెద్ద స్థాయికి వెళ్లాలి. మాతో మరో సినిమా చేయాలని కోరుకుంటున్నా. మా హీరోయిన్ బాగా చేసింది. ఆమె కట్టు, బొట్టు అద్భుతం. యశ్న చాలా బాగా చేశారు. ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు. ఈ సినిమాను ఆదరించండి’ అని కోరుకున్నారు.
నిర్మాత వేణుగోపాల్ మాట్లాడుతూ ‘సినిమా సక్సెస్ చేసిన మీడియాకు థాంక్స్. సినిమాను ఆదరించిన అందరికీ ధన్యవాదాలు. నేను బిజీ కారణంగా షూటింగ్ లొకేషన్లకు ఎక్కువగా వెళ్ళలేదు. అందరూ చాలా కష్టపడ్డారు. డీఓపీ, మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతం. సినిమాకు ప్రాణం పోసింది మార్క్ ప్రశాంత్. మాహీ పక్కన సీత చక్కగా సెట్ అయింది. సినిమాను బుజాల మీద మోసిన మా డైరెక్టర్ రాకేష్ గారికి థాంక్స్. అన్ని తానై చూసుకున్న అనిల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.