మాస్టర్ మహేంద్రన్ హీరోగా, రాకేష్ మాధవన్ తెరకెక్కించిన చిత్రం ‘నీలకంఠ’. యష్న ముతులూరి, నేహా పఠాన్ హీరోయిన్లుగా నటించగా.. స్నేహా ఉల్లాల్ కీలక పాత్రలో నటించారు. ఎం.మమత, ఎం.రాజరాజేశ్వరి సమర్పణలో మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా నూతన సంవత్సరం కానుకగా జనవరి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా వచ్చిన నీలకంఠ భారీ హిట్ అందుకుంది. మొదటి రోజే కోటి రూపాయల కలెక్షన్ అందుకుని.. రూరల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సినిమా హిట్…