పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు సాధించిన మను భాకర్ ఈ ఏడాది ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ కాలేదని వార్తలు వస్తున్నాయి. ఇదే ఇప్పుడు క్రీడావర్గంలో తీవ్ర చర్చకు దారితీసింది. మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు నామినీల జాబితాలో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనుభాకర్ పేరు తొలగించినట్లు సమాచారం. కమిటీ ఆమె పేరును రికమెండ్ చేయలేదని తెలిసింది.
ఎర్రకోటలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన మల్లికార్జన ఖర్గే గౌర్హాజరయ్యారు.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ పరీక్షను నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ మరియు బీహార్‌లలో ఈ పరీక్ష నిర్వహణ కోసం 21 నగరాల్లో 120 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పరీక్షకు విద్యార్థులు చాలా తక్కువ మంది హాజరయ్యారు. ఈ ఏడాది 40.92 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు.