సూర్యాపేట జిల్లా కోదాడలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాకూర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పరిష్కరించడంలోనూ, అభివృద్ధి, సంక్షేమంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. అంతేకాకుండా.. హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర గ్రామ గ్రామన విజయవంతంగా కొనసాగుతుందన్నారు. రాహుల్ గాంధీ సందేశాన్నీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు చేరవేస్తున్నారన్నారు. అనంతరం మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ సందేశాన్ని కాంగ్రెస్ నేతలు సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఆయన అన్నారు.
Also Read : Do Kaliyaan Movie: మూడు భాషల్లో మురిపించిన కథ!
రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రత్వంగా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందన్నారు జానారెడ్డి. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకురావాల్సిన సమయం వచ్చిందని.. కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఆయన కోరారు. నల్లగొండ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Today Stock Market Roundup 01-03-23: హమ్మయ్యా. 8 రోజుల తర్వాత ఊపిరి పీల్చుకున్న ఇన్వెస్టర్లు
ఇదిలా ఉంటే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర కరీంనగర్ జిల్లాలో కొనసాగుతోంది. అందులో భాగంగా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ దర్గాను సందర్శించిన రేవంత్ రెడ్డి దర్గా ఆచారం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూలచాదర్ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.