Today Stock Market Roundup 01-03-23: ఇండియన్ స్టాక్ మార్కెట్‌కి మార్చిలో శుభారంభం లభించింది. ఈ నెలలో మొదటి రోజైన ఇవాళ బుధవారం ఉదయం రెండు కీలక సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలోనూ ప్రాఫిట్స్ కొనసాగాయి. దీంతో సాయంత్రం సైతం లాభాలతో ముగిశాయి. ఫలితంగా.. వరుసగా 8 రోజుల నుంచి వస్తున్న నష్టాలకు ఎట్టకేలకు బ్రేక్ పడటం వల్ల ఇన్వెస్టర్లు హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు.
యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరియు మారుతీ సుజుకీ వంటి లార్జ్‌క్యాప్ స్టాక్స్ విలువ పెరగటం కలిసొచ్చింది. సెన్సెక్స్ 448 పాయింట్లు పెరిగి 59 వేల 411 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 146 పాయింట్లు పెరిగి 17 వేల 450 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
read more: Not only Adani. But also Ambani: హిండెన్‌బర్గ్ వల్ల అదానీకి చివరికి మంచే జరగబోతోంది!. ఎలాగంటే..
సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో ఏకంగా 28 కంపెనీల షేర్లు ర్యాలీ తీశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఆయిల్ ఇండియా, ఓఎన్‌జీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు రాణించగా పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్స్ విలువ పడిపోయింది. సెక్టార్ల వారీగా పరిశీలిస్తే.. అన్ని రంగాల్లోని కంపెనీల షేర్ల విలువ గరిష్ట స్థాయిలో ఎండ్ అయింది.
నిఫ్టీ పీఎస్‌యూ, మెటల్ ఇండెక్స్‌లు 2 శాతం వరకు లాభపడ్డాయి. వ్యక్తిగత స్టాక్స్‌ను గమనిస్తే.. డెలివెరీ సంస్థ షేర్ల కొనుగోలు పట్ల పెట్టుబడిదారులు దృష్టి సారించారు. దాదాపు 4 శాతం ఈక్విటీలు చేతులు మారటం సానుకూలంగా పనిచేసింది. గుజరాత్ పిపావవ్ పోర్ట్ స్టాక్స్ వ్యాల్యూ 4 శాతం పెరిగింది.
ఫలితంగా దాదాపు 52 వారాల గరిష్ట విలువకు చేరుకుంది. 10 గ్రాముల బంగారం రేటులో పెద్దగా మార్పులేదు. అతిస్వల్పంగా 31 రూపాయలు తగ్గింది. అత్యధికంగా 55 వేల 725 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 158 రూపాయలు లాభపడింది. గరిష్టంగా 63 వేల 941 రూపాయలు పలికింది.
క్రూడాయిల్ రేటు స్వల్పంగా 69 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడిచమురు 6 వేల 335 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 8 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 52 పైసల వద్ద స్థిరపడింది.