సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నల్లగొండ జిల్లాలో కొనసాగుతోంది. అయితే.. ఇవాళ చందనపల్లి గ్రామంలో కొనసాగుతున్న భట్టి పాదయాత్రలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ మాణిక్ రావ్ థాక్రే, ఏఐసీసీ సెక్రెటరీ రోహిత్ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియాలో మాణిక్ రావ్ థాక్రే మాట్లాడుతూ.. భట్టి విక్రమార్క పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందన్నారు. దారి వెంట ప్రజలు తమ సమస్యలను, కష్టాలను, ఇబ్బందులను భట్టి విక్రమార్కకు చెప్పుకోవడానికి ఆసక్తి చూపారని ఆయన వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచడానికే భట్టి పాదయాత్ర చేస్తున్నారని ఆయన వెల్లడించారు.
Also Read : Pakistan: ప్రధాని మోడీ అమెరికా పర్యటనపై పాకిస్తాన్ కీలక వ్యాఖ్యలు..
పేదలను విస్మరించి, కుటుంబ సభ్యుల కోసమే కేసీఆర్ పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజల సంపదను కేసీఆర్ తన కుటుంసభ్యుల కోసం దోచి పెడుతున్నారని, నిరుద్యోగులకు శాపంగా మారింది బీఆర్‌ఎస్ పాలన సాగుతోందని ఆయన విమర్శలు గుప్పించారు. చిన్న, సన్నకారు రైతులు కేసీఆర్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వంద శాతం 2023లో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందన్న మాణిక్ రావ్.. తెలంగాణ ప్రభుత్వం దేశ వ్యాప్త ప్రచారం కోసం ప్రజల సొమ్ము వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందన్నారు.
Also Read : Virat Kohli Net Worth: సంపాదనలోనూ ‘కింగే’.. విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
బీజేపీ, బీఆర్‌ఎస్‌లు రహస్య మిత్రులు అని… రెండూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. డీకే శివ కుమార్ తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు వచ్చే విషయంలో ఏఐసీసీ పెద్దలదే నిర్ణయమని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి దేశంలో ఉన్న అందరూ కీలక కాంగ్రెస్ నేతలు వస్తారని.. పని చేస్తారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలందరికీ వివిధ పార్టీలకు చెందిన చాలా మంది నేతలు టచ్ లో ఉన్నారన్నారు.