టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ తండ్రిగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. శనివారం నాడు మంచు మనోజ్ భార్య మౌనిక రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మొదట మనోజ్ అక్క మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా విషయాన్ని తెలియజేసింది.. దేవతల ఆశీర్వాదంతో మా ఇంటికి మరో చిన్నారి దేవత వచ్చిందంటూ తెలుపుతూ.. మనోజ్, మౌనికాలకు కుమార్తె పుట్టిందని.. మాకు ఎంతో సంతోషంగా ఉందంటూ తెలిపింది. అంతేకాకుండా పాపకు మేము ‘ఎంఎం పులి’ అని ముద్దుగా పిలుచుకుంటామన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Also read: Uttar Pradesh: 14 ఏళ్ల బాలికపై మతగురువు అత్యాచారం.. గర్భం దాల్చడంతో వెలుగులోకి అఘాయిత్యం..
ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, మంచు మనోజ్ అభిమానులు, మరోవైపు రాజకీయ పెద్దలు దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక నేడు ఆదివారం మౌనిక రెడ్డి డిశ్చార్జ్ కావడంతో పాపతో కలిసి ఇంటికి చేరుకున్నారు. ఆస్పత్రి నుంచి మౌనిక రెడ్డి డిశ్చార్జ్ అయ్యాక కొడుకు ధైరవ్ తో సహా నేరుగా ఫిలింనగర్ లో ఉన్న వారి ఇంటికి వెళ్లారు. ఇక ఇంట్లోకి వెళ్తున్న సమయంలో పాపను మొదటిసారి ఇంట్లోకి తీసుకు వెళ్తున్న సందర్భంగా వారికి హారతి ఇచ్చి పూలతో స్వాగతం పలికారు ఇంట్లోని వాళ్ళు.
Also read: Balakrishna: రాబోయే ఎన్నికల్లో గెలుపు మనదే.. వైసీపీపై తీవ్ర విమర్శనాస్త్రాలు
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత ఏడాది మార్చిలో మంచు మనోజ్, మౌనికలు ఇద్దరు రెండు వివాహం చేసుకున్నారు. ఇక అప్పటికే మౌనిక రెడ్డికి ధైరవ్ అనే కుమారుడు ఉన్నాడు. ఇక పెళ్లి తర్వాత మౌనిక రెడ్డి గర్భం దాల్చిన విషయాన్ని, అలాగే మౌనిక సంబంధించి సీమంతం ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరివురి మొదటి సంతానం ఇంట్లో అడుగుపెట్టడంతో వారి ఆనందంగానికి అవధులు లేకుండా పోయాయి.