New Born Baby: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో వైద్య శాస్త్రాన్ని ఆశ్చర్యపరిచే అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాజా తుకోజీరావ్ ఆసుపత్రి (MTH)లో ఆగస్టు 13న ఓ శిశువు జన్మించింది. ఈ శిశువుకు రెండు తలలు, రెండు గుండెలు, నాలుగు చేతులు, రెండు కాళ్లు ఉండగా ఛాతీ, పొట్ట మాత్రం ఒకటే శరీరంగా ఉన్నాయి. ఖరగోన్ జిల్లా, మోతాపుర గ్రామానికి చెందిన సోనాలి–ఆశారామ్ దంపతులకు పుట్టిన ఈ శిశువు వారి మొదటి సంతానం. పుట్టిన వెంటనే వైద్యులు…
జనగామ జిల్లాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్నపేగు బంధాన్ని తెంచుకుంటూ.. ఓ తల్లి రోడ్డు పక్కన పసికందును వదిలేసి వెళ్లిపోయింది. పసిబిడ్డ ఏడుపు విన్న స్థానికులు.. స్నానం పోసి అక్కున చేర్చుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆ బిడ్డ తల్లిదండ్రులు కనిపించలేదు. దాంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముక్కు పచ్చలారని పసికందును బహిరంగ ప్రదేశంలో వదిలేసిన ఘటన జిల్లాలో ఇప్పుడు కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం… జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో…
ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదు గాని అప్పుడే పుట్టిన బిడ్డను చెత్తకుప్పల్లో పడేసి వెళ్ళిపోయింది. కనీస మానవత్వంతో ఆలోచించని ఆ తల్లి ప్రేగు తెంచుకొని పుట్టిన బిడ్డను చెత్తలో పడేసింది. మరో విధంగా ఆలోచిస్తే అమ్మ జాతికి మాయని మచ్చ తెచ్చే ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది.
టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ తండ్రిగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. శనివారం నాడు మంచు మనోజ్ భార్య మౌనిక రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మొదట మనోజ్ అక్క మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా విషయాన్ని తెలియజేసింది.. దేవతల ఆశీర్వాదంతో మా ఇంటికి మరో చిన్నారి దేవత వచ్చిందంటూ తెలుపుతూ.. మనోజ్, మౌనికాలకు కుమార్తె పుట్టిందని.. మాకు ఎంతో సంతోషంగా ఉందంటూ తెలిపింది. అంతేకాకుండా పాపకు మేము…
పండంటి రెండో బిడ్డకు జన్మనిచ్చిన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు తమ కొడుకుకు 'అకాయ్' అని నామకరణం చేశారు. అయితే ఆ పేరుకు అర్థం ఏంటంటే ప్రకాశించే చంద్రుడని అర్థం. ఈ పేరు టర్కిష్ మూలానికి చెందినది. ఇక మొదటి కుమార్తెకు 'వామిక' అని పేరు పెట్టారు. వామిక అంటే దుర్గాదేవి అని అర్థం. శివుడిలో సగభాగమైన పార్వతీ దేవి మరోపేరు వామిక. అలాగే విరాట్-అనుష్క పేర్లు కలిసేలా ఈ పేరు ఉంది.
West Bengal : పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా మెడికల్ కాలేజీలో 24 గంటల్లో 9 మంది చిన్నారులు చనిపోయారు. ఇంకా చాలా మంది నవజాత శిశువుల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని చెప్పారు.
ఓ డాక్టర్ నిర్లక్ష్యం ఇద్దరు శిశువుల ప్రాణం తీసింది. అప్పుడే పుట్టిన పిల్ల గురించి కాకుండా తన సౌకర్యం కోసం డాక్టర్ ఆలోచించడంతో కళ్లు తెరచి సరిగ్గా ప్రపంచాన్ని కూడా చూడని బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. ఓ డాక్టర్ ఏసీ వేసుకొని పడుకోవడంతో చలికి తట్టుకోలేక తెల్లారేసరికి నవజాత శిశువులు ఇద్దరు మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాలో ఓ ప్రైవేట్ క్లినిక్‌లో చోటు చేసుకుంది. Also Read: Urinate in Mouth: దారుణం.. మహిళను…
New Born Baby Starts Walking: కొంత మంది పిల్లలు భలే యాక్టివ్ గా ఉంటారు. ఎంతో చురుగ్గా వారి వయసు కంటే ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంటారు. అయితే ఇవన్నీ మరీ పుట్టినప్పుడే రావు కొన్ని రోజుల తరువాత వస్తాయి. అయితే ఇక్కడ ఓ బుడ్డోడు మాత్రం పుట్టిన మొదటి రోజే తన మ్యాజిక్ చూపించాడు. సాధారణంగా పుట్టిన తరువాత ఐదు నుంచి ఆరు నెల తరువాత పిల్లలు నడవడానికి ప్రయత్నిస్తారు. తరువాత ఏడాదికి బుడి…
ఉత్తరప్రదేశ్ లోని బహేరిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో అరుదైన జన్యుపరమైన రుగ్మత (హార్లెక్విన్ ఇచ్థియోసిస్)తో శిశువు జన్మించింది. అయితే ఆ శిశువు మూడు రోజులు గడిచినా ఇంకా బతికే ఉంది.
మానవత్వం అనేది మనుషులకు లేకుండా పోతుంది.. అభం, శుభం తెలియని పసికందులను కూడా రోడ్డు పాలుచేస్తున్నారు.. చేసిన పాపాలను వదిలించుకోవాలని దారుణాలకు ఒడిగడుతున్నారు.. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో అమానుష ఘటన వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన నవజాత శిశువును గోనెసంచిలో పెట్టి తాసిల్దార్ కార్యాలయం దగ్గర వదిలేసి వెళ్లారు.. ఆ బిడ్డ మగ బిడ్డ. తాసిల్దార్ కార్యాలయం ఆవరణలోని మర్రిచెట్టు మొదలు దగ్గర గోనే సంచిలో మగ శిశువు దొరికింది. ఈ ఘటన బుధవారం ప్రకాశం జిల్లా…