Manasantha Nuvve Re-Release: ఒకప్పుడు లవర్ బాయ్ హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో ఉదయ్ కిరణ్. టాలీవుడ్ నుంచి వచ్చిన కల్ట్ లవ్ స్టోరీ చిత్రాల్లో అనేకం ఈ హీరో ఖాతాలోనే ఉన్నాయి. అలా తన స్టార్టీంగ్ కెరీర్‌లోనే లవ్ స్టోరీస్‌తో ఇండస్ట్రీలో సూపర్ హిట్స్ అందుకున్నాడు ఈ హీరో. అలాంటి సూపర్ హిట్ లవ్ స్టోరీలలో ఒకటైన “మనసంతా నువ్వే” సినిమాకు ప్రేక్షకులలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ ఈ సినిమా పాటలు ఆడియెన్స్ మదిలో మెదులుతూనే ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రాన్ని దర్శకుడు వి ఎన్ ఆదిత్య 2001లో తెరకెక్కించాడు. తాజాగా ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమా మరోసారి వెండి తెరపై ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతుంది.
READ ALSO: Rashmika: ఆ విషయంలో దీపికతో ఢీ అంటే ఢీ అంటున్న రష్మిక?
దర్శకుడు వి ఎన్ ఆదిత్య తెరకెక్కించగా ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సందర్భంగా మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి ఈ సినిమా వెండి తెరపైకి రాబోతుంది. ఈ చిత్రాన్ని రీమాస్టర్ చేసి 4కె, ఇంకా డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్‌లలోకి మార్చి వచ్చే ఏడాది లవర్స్ డే గిఫ్ట్‌గా ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నట్లు తాజాగా కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్‌కు జోడిగా రీమా సేన్ నటించింది. ఆర్పీ పట్నాయక్ ఆల్బమ్ ఈ చిత్రానికి అదనపు బలం అందించింది. మరోసారి ఈ సినిమా థియేటర్స్‌ను షేక్ చేస్తుందా అనేది చూడాలి మరి.
READ ALSO: Ramayana: విజువల్ వండర్‌గా ‘రామాయణ’ : నితేశ్ తివారీ