బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం ఒక సంచలన వివాదంలో చిక్కుకున్నారు. గత కొంతకాలంగా నటి శ్రీలీలతో ఆయన డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వస్తుండగా, తాజాగా ఒక టీనేజ్ అమ్మాయితో ఆయన హోటల్ రూమ్‌లో దొరికిపోయారనే పుకార్లు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. యూకేకి చెందిన 17 ఏళ్ల కరీనా కుబిలియుటే అనే అమ్మాయితో కలిసి కార్తీక్ గోవాలోని ఒక లగ్జరీ హోటల్‌లో బస చేశారనే వార్త వైరల్ కావడంతో నెటిజన్లు ఆయన పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. శ్రీలీలకు అన్యాయం చేయొద్దని, ఒక టీనేజ్ అమ్మాయితో ఇలాంటి వ్యవహారాలు ఏంటని నెటిజన్లు కార్తీక్‌ను ట్రోల్ చేస్తున్నారు.
Also Read : Avika : ప్రెగ్నెన్సీ వార్తలపై అవికా గోర్ రియాక్షన్.. ‘అదంతా అబద్ధం.. అసలు విషయం వేరే ఉంది’
అయితే, ఈ వివాదంపై కరీనా కుబిలియుటే స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తనకు కార్తీక్ ఆర్యన్ ఎవరో కూడా తెలియదని, తాను తన కుటుంబంతో కలిసి సెలవుల కోసం గోవా వెళ్లానే తప్ప అతని కోసం కాదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆమె కోరారు. తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో కూడా ‘నాకు కార్తీక్ తెలియదు’ అని రాసి, పోస్ట్‌లకు కామెంట్లను ఆపేసింది. ఈ విషయంలో కార్తీక్ ఆర్యన్ ఇప్పటికీ మౌనంగా ఉండటం గమనార్హం. కొందరు ఆయనను విమర్శిస్తుంటే, మరికొందరు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఇలాంటి నిరాధార పుకార్లు పుట్టించడం కరెక్ట్ కాదు అని మద్దతుగా నిలుస్తున్నారు.