Liquor Bottles: దొంగిలించిన మద్యం పంపకం విషయంలో గొడవ.. స్నేహితుడి దారుణ హత్య
- దొంగిలించిన మద్యం పంపకం విషయంలో వాగ్వాదం
- స్నేహితుడి దారుణ హత్య
- ఇద్దరు నిందితులు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Bottles: దొంగిలించిన మద్యం పంపకం విషయంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో స్నేహితుడినే దారుణంగా హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గోపాల్‌పూర్‌లో జరిగింది. ఈ కేసు వివరాలను తాండూర్ డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి వెల్లడించారు. గత నెల 31న గోపాల్పూర్ గ్రామ సమీపంలో గల క్వారీ గుంతలో రుద్రారం గ్రామానికి చెందిన బండమీది రమేష్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టి స్నేహితులే నిందితులుగా గుర్తించారు. హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో దొరికిన పర్సు ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేసినట్లు తెలిసింది.
Read Also: Wolf Attack : 200 మంది పోలీసులు, 18 మంది షూటర్లు… తోడేళ్ల అంతానికి భారీ ఆపరేషన్
Also Read
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రుద్రారం గ్రామానికి చెందిన నరేష్, సల్బతాపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్, బండమీది రమేష్ ముగ్గురు స్నేహితులు. ముగ్గురు తాండూరులో కలుసుకొని పెద్దేముల్లో మద్యం సేవించారు. అనంతరం పెద్దేముల్ తండాలోని కల్లు కాంపౌండ్‌లో 13 లిక్కర్ బాటిళ్లు చోరీ చేశారు. గోపాల్పూర్ పరిసరాల్లో 3 బాటిళ్లను సేవించి.. మిగతా బాటిళ్లను పంచుకుందామని అనుకున్నారు. రమేష్ తనకు మద్యం ఎక్కువగా తాగే అలవాటు ఉందని.. తనకు ఎక్కువ బాటిళ్లు కావాలని డిమాండ్ చేశాడు. లేకుంటే బాటిళ్లు దొంగతనం విషయం బయటపెడతానని హెచ్చరించాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం పెరిగి గొడవ పెద్దదైంది.
మద్యం మత్తులో ఉన్న శ్రీకాంత్, నరేష్‌లు ఇద్దరు కలిసి.. రమేష్‌ను బెల్టుతో గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని పక్కనే ఉన్న క్వారీ గుంతలో నీటిలో పడేశారు. రమేష్ ఇంటికి రాకపోవడంతో అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహం దగ్గర దొరికిన పర్సు ఆధారంగా శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా..అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకడైన శ్రీకాంత్ గతంలో కారు అద్దాలు పగలగొట్టి కెమెరాను దొంగిలించిన కేసులో నిందితుడిగా ఉన్నాడు.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..