Mamata Banerjee: ఏకపక్ష చర్చలు సరికాదు.. ప్రధాని మోడీకి బెంగాల్ సీఎం లేఖ
- ప్రధాని మోడీకి సీఎం మమతా బెనర్జీ లేఖ
- తీస్తా నదీ జలాల పంపిణీపై ఇటీవల చర్చలు
- తనను సమావేశానికి ఆహ్వానించనందుకు ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. ప్రధాని మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య చర్చలకు తనను ఆహ్వానించనందుకు ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం, బంగ్లాదేశ్ మధ్య నీటి పంపకంపై చర్చలపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కోల్‌కతా-ఢాకా మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని సీఎం మమతా బెనర్జీ హైలైట్ చేస్తూ.. “సంప్రదింపులు, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం లేకుండా ఇటువంటి ఏకపక్ష చర్చలు ఆమోదయోగ్యం కాదు” అని ఆమె పేర్కొన్నారు. గంగా నది, తీస్తా నది జలాల షేరింగ్ అంశంపై ఇటీవల ప్రధాని షేక్ హసీనా, మోదీ మధ్య చర్చలు జరిగాయి.
CM Chandrababu: రాజధాని పునర్నిర్మాణంపై సీఎం ఫోకస్.. నిర్మాణ రంగ కంపెనీల ప్రతినిధులతో భేటీ
Also Read
పీఎం మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య ఇటీవల జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో.. తీస్తా నది పరిరక్షణ, నిర్వహణ.. 1996 గంగా జల ఒప్పందాన్ని పునరుద్ధరించడంపై ఇరువురు నేతలు చర్చించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రధాని మోడీ.. ‘తీస్తా నది పరిరక్షణ, నిర్వహణ’పై చర్చించేందుకు సాంకేతిక బృందం త్వరలో బంగ్లాదేశ్‌ను సందర్శిస్తుందని చెప్పారు. అయితే.. ఫరక్కా బ్యారేజీ కోత, పూడిక, వరదలకు కారణమైందని టీఎంసీ ఆరోపిస్తుంది. కాగా.. నీటి పంపిణీ ఒప్పందాన్ని మమతా సర్కార్ చాలా కాలంగా వ్యతిరేకిస్తుంది. ఈ క్రమంలో.. ఈ భేటీపై మమతా బెనర్జీ మండిపడ్డారు.
Robert vadra: వయనాడ్‌లో ప్రియాంక పోటీపై రాబర్ట్ వాద్రా ఏమన్నారంటే..!
ఇటువంటి ఒప్పందాల ప్రభావం వల్ల పశ్చిమ బెంగాల్ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని మమతా బెనర్జీ లేఖలో ప్రస్తావించారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఫరక్కా ఒప్పందాన్ని రెన్యువల్ చేయాలన్న ఆలోచనలో కేంద్ర సర్కారు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. దాని వల్ల పశ్చిమ బెంగాల్‌పై ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆమె తన లేఖలో తెలిపారు.
తాజావార్తలు
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!