రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్‌మేట్ మండలంలోని ఇనాంగూడ, నాగంపల్లి, పోల్కంపల్లి, మన్నెగూడ, నెర్రపల్లి దండు మైలారం రాయపోల్ వివిధ గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ ఉందని తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు మన ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించి రుణం తీర్చుకోవాలని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిందని కనీస సౌకర్యాలు కల్పించని ప్రభుత్వంని గద్దె దించాలని ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
Tamil Nadu: సుప్రీం వ్యాఖ్యల తర్వాత కూడా.. 10 బిల్లులను తిప్పిపంపిన గవర్నర్ ఆర్ఎన్ రవి..
ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించి చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా స్వచ్చందగా ప్రజలు కాంగ్రెస్ ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. ఇబ్రహీం పట్నం నియోజకవర్గంలో అవినీతిపరుడు ఎమ్మెల్యే గా ఉన్నాడని…ప్రజల భూములు లాకున్నడని ఆరోపించారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదన్నారు. గతంలో తాను ఉన్నపుడే నియోజకవర్గం అభివృద్ధి చెందింది అని అన్నారు.ఈ ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్ ను ఓటమి పాలు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.