Mallu Ravi : కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇవ్వలేదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి. రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలపై స్పందించిన మల్లు రవి మాట్లాడుతూ.. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారన్నారు. నాడు వైఎస్ఆర్ రైతులకు ఉచిత కరెంటు ఇస్తుంటే కేసీఆర్ ఎక్కడి నుండి ఇస్తారని అనలేదా అని ఆయన అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో ప్రభుత్వం ప్రైవేటు సంస్ధలతో కుమ్మక్కై ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందన్నారు.
Also Read : Himanshu : గొప్ప మనసు చాటుకున్న కేసీఆర్ మనవడు.. రూ. కోటితో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేసిన హిమన్షు
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తామో రైతు డిక్లరేషన్ లో చెప్పామని, అమెరికాలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు… ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎటుపోయాయని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయారని, తెలంగాణ రాష్ట్ర డిమాండ్స్ ను కేంద్రం దృష్టికి ఏనాడైన తీసుకువెళ్లారా అని ఆయన అన్నారు.
Also Read : Kishan Reddy : దేశంలో ఎక్కడా లేనంత అవినీతి తెలంగాణలో ఉంది
రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాలపై రాజకీయంగా లబ్ది పొందాలని బీఆర్ఎస్ చూస్తోందని, పేరుకు 24 గంటల ఉచిత విద్యుత్ అంటున్నారు కానీ అది క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదన్నారు మల్లు రవి. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు రెండు సార్లు అధికారం ఇచ్చారు… ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ ను ఓడించడం ఖాయమని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే పోలీసు రాజ్యం వస్తుందని, డిస్కంలకు ఇవ్వాల్సిన డబ్బులు ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!