రవితేజ హీరోగా నటిస్తున్న ఓ చిత్రం సంక్రాంతి బరిలోకి దిగబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి రవితేజ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలు కలిసి రావడం లేదు. ప్రస్తుతానికి ఆయన భాను భోగ వరపు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత ఆయన చేసే సినిమా దాదాపుగా ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయబోతున్నాడు.
David Warner: టాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న వార్నర్
ఈ మధ్యనే కథ చెప్పిన కిషోర్ తిరుమల రవితేజ కోరినట్లుగా ఫైనల్ స్క్రిప్టింగ్ పూర్తిచేసే పనిలో పడ్డారు. ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ప్రస్తుతానికి ది పారడైజ్ అంటూ ప్లానింగ్ తో సినిమా చేస్తున్న ఆయన రవితేజతో కూడా ఒక సినిమా మొదలు పెట్టబోతున్నారు. మే నెలలో షూటింగ్ మొదలుపెట్టి ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చే ప్లానింగ్ జరుగుతోంది. ఈ ఏడాది చివరి లోపు ప్రస్తుతం రవితేజ చేస్తున్న భాను భోగవరపు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.