Malayalam Actress Shweta Menon: సామాజిక కార్యకర్త మార్టిన్ ఫిర్యాదు మేరకు కొచ్చి పోలీసులు మలయాళ నటి శ్వేతా మేన్‌పై కేసు నమోదు చేశారు. ఆమె నటించిన పలు సినిమాల్లోని అభ్యంతరకర సన్నివేశాలు, వాణిజ్య ప్రకటనలు సోషల్ మీడియాలో ప్రసారం కావడంపై కొన్ని రోజుల క్రితం మార్టిన్ ఫిర్యాదు చేయగా.. పోలీసులు అప్పుడు పట్టించుకోలేదని సమాచారం. దీంతో, ఆయన ఎర్నాకుళం కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. డబ్బు కోసం అడల్ట్ చిత్రాల్లో నటిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని మార్టిన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
READ MORE: US tariff on India: ట్రంప్ టారిఫ్ బాంబ్.. స్పందించిన భారత్.. ఏమన్నదంటే?
అమ్మ అధ్యక్ష పదవికి పోటీ.. ఇంతలో
అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) అధ్యక్ష పదవికి శ్వేతా మేనన్ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఆమెపై కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. శ్వేతా మేనన్ నటించిన తొలి సినిమా ‘అనస్వరం’. ‘రతి నిర్వేదం’, ‘100 డిగ్రీ సెల్సియస్’లాంటి మలయాళ మూవీస్ తోపాటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లోనూ నటించారు. 1994లో ‘ఫెమినా మిస్ ఇండియా ఏషియా పసిఫిక్‌గా ఆమె నిలిచారు. తెలుగులో ‘ఆనందం’ సినిమాలో ప్రత్యేక గీతంలో మెరిసిన శ్వేత, ‘జూనియర్స్’, ‘రాజన్న’ తదిరత సినిమాల్లో సందడి చేశారు.
READ MORE: Trump Effect: అగ్రరాజ్యానికి ట్రంక్ ఎఫెక్ట్ కానుందా..?