Mahindra Thar ROXX: మహీంద్రా & మహీంద్రా కంపనీనుండి రాబోయే 5 డోర్ల థార్ విడుదల కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 15న లాంచ్ కానున్న మహీంద్రా థార్ రాక్స్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా కంపెనీ విడుదల చేసింది. ఈ వీడియోలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సూపర్‌హిట్ చిత్రం ‘షరాబి’ లోని ‘ఇంతహా హో గయీ ఇంతెజార్ కి…’ పాటతో పెద్ద థార్ బయటి లుక్ ను చూపబడింది. మహీంద్రా థార్ 3 డోర్ మోడల్ పరిగణన లోకి తీసుకుంటే 5 డోర్ల థార్ నుండి పెద్ద అంచనాలను కలిగి ఉంది.
Green Tea vs Green Coffee: బరువు తగ్గడానికి ఏది మంచిది.?
మహీంద్రా థార్ 3 డోర్‌లో సీటింగ్ స్థలం లేకపోవడం సమస్యను అధిగమించడానికి కంపెనీ 5 డోర్ మోడల్ ను తీసుకువస్తోంది. దీని వీల్‌బేస్ కొంచెం పొడవుగా ఉంది. అలాగే వెనుక సీటు ప్రయాణీకుల కోసం 2 ప్రత్యేక తలుపులు అందించబడ్డాయి. C మోటిఫ్ LED DRLలు, కొత్త డ్యూయల్ టోన్ మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్ తో కూడిన వృత్తాకార LED హెడ్‌లైట్ లతో కొత్త థార్ ఎలా ఉందొ వీడియోలో చూడవచ్చు. ఇక దీని ప్రారంభ ధర సుమారు రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు.
Wi-Fi Speed: మీ వైఫై స్పీడ్ తక్కువుగా ఉందా.? ఇలా చేయండి పరిమితిలేని వేగాన్ని పొందండి..
నివేదికల ప్రకారం., ఈ SUV 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇది వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది కాకుండా, ఈ SUV యొక్క అన్ని వేరియంట్లలో 6 ఎయిర్ బ్యాగ్ లు, 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, ADAS లెవల్ 2 సేఫ్టీ ఫీచర్లను అందించవచ్చు. 3 డోర్ కంటే 5 డోర్ థార్ పెద్దదిగా ఉంటుందని ఒక విషయం స్పష్టమైంది. 5 డోర్‌ను ప్రీమియంగా కనిపించేలా చేయడానికి, కంపెనీ డిజైన్‌లో కొన్ని మార్పులు చేసింది. కొత్త LED హెడ్‌లైట్‌లు, DRLలు, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్ డిజైన్, కొత్త టెయిల్ ల్యాంప్‌లు కొత్త థార్‌లో చూడవచ్చు. మహీంద్రా ఇంకా కొత్త థార్ డైమెన్షన్ వివరాలను వెల్లడించలేదు. అయితే 3-డోర్ల థార్‌తో పోలిస్తే 5 డోర్ల థార్ పొడవు ఎక్కువగా ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది.
Four wheels never carried so much anticipation before. 'THE' SUV arrives on Independence Day. Stay tuned
Know more: https://t.co/0t63tj3wYv#ComingSoon #THESUV #TharROXX #ExploreTheImpossible pic.twitter.com/P3FkukGMiS
— Mahindra Thar (@Mahindra_Thar) July 29, 2024