తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాదిలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు.. ఆ సినిమా గురించి అనౌన్స్ చేసి చాలా కాలం అవుతుంది.. ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు.. మాములుగా జక్కన్న సినిమా అంటే లేటు.. అయితే ఇప్పటివరకు కొబ్బరి కాయ కొట్టక పోవడంపై ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు..
ఈ సినిమా మొదలు కాలేదు కానీ అంచనాలు ఓ రేంజులో ఉన్నాయి.. కథ ఎప్పుడో సిద్ధం చేసిన జక్కన్న ఇంకా పనులు మొదలు పెట్టక పోవడం పై అనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక మహేష్ బాబు మాత్రం టైం దొరికితే చాలు ఫ్యామిలీ తో ట్రిప్ లకు వెళ్తుంటారు.. సినిమాలకు గ్యాప్ దొరికితే మహేష్ ఎక్కువగా ఫారిన్ లకు వెళ్తుంటాడు.. తాజాగా మరోసారి ఫ్యామిలితో కలిసి వెకేషన్ కి వెళ్లారు.. ఈరోజు ఉదయం మహేష్ బాబు, సితార, గౌతమ్, నమ్రత కలిసి వెళ్తూ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కెమెరాలకు చిక్కారు..
ఇక మరోసారి మహేష్ ఫ్యామిలితో కలిసి వెకేషన్ కి వెళ్తుండటంతో రాజమౌళి సినిమా ఇంకెప్పుడు మొదలుపెడతారు అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇక కొంతమంది అయితే రాజమౌళి సినిమా మొదలైతే కొన్నేళ్ల వరకు బయటకు వెళ్లడానికి వీలుండదు.. అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు.. ఇక రాజమౌళి, మహేష్ సినిమా కోసం అందరు వెయిట్ చేస్తున్నారు..
Superstar #MaheshBabu along with his family off to a vacation ♥️✈️#Superstar #SSMB #SSMB29#NamrataShirodkar #GautamGhattamaneni #SitaraGhattamaneni pic.twitter.com/ne369SU14H
— Sai Satish (@PROSaiSatish) March 23, 2024