Mahesh Babu – Naga Chaitanya: అక్కినేని నట వారసుడిగా, కింగ్ నాగార్జున కుమారుడిగా వెండి తెరకు పరిచయం అయిన హీరో అక్కినేని నాగ చైతన్య. ఈ యంగ్ హీరో తన ఫస్ట్ సినిమాతోనే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజా ఈ టాలెంటెడ్ హీరో తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌తో రూటు మార్చి తన నెక్ట్స్ సినిమాను విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాను కార్తీక్ దండు క్రేజీ సూపర్ నాచురల్ త్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. రేపు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని, టైటిల్‌ను రివీల్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక నాగచైతన్య కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగారు. ఎలాగో తెలుసా..
ఈ సినిమా పోస్టర్ లాంచ్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు రానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా తాలూకా ఫస్ట్ లుక్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌లు ఎలా ఉండబోతున్నాయో రేపు తెలుస్తుంది. ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చుతుండగా, హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి అలరించడానికి సిద్ధం అవుతుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర వారు నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల అయిన ప్రచార వీడియో సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది.
READ ALSO: Starlink: విమానాల్లో జెట్ స్పీడ్ ఇంటర్నెట్‌కి స్టార్లింక్ సెట్.. 13 ఏర్‌లైన్స్‌లో 250 Mbps సేవలు