Starlink: జెట్ స్పీడ్‌తో దూసుకుపోయే విమానాల్లో ఇంటర్నెట్ మాత్రం చాలా స్లోగా ఉంటుంది. ఇకపై ఈ సమస్యకు చెక్ పెట్టడానికి స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఎంట్రీ ఇస్తోంది. విమాన ప్రయాణంలో భాగంగా 30 వేల అడుగుల ఎత్తులో కూడా భూమిపై లాంటి వేగంతో నెట్ అందించడం స్టార్లింక్ ప్రధాన లక్ష్యంగా కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇకపై విమానాల్లో నెమ్మదైన ఇంటర్నెట్‌కు చెక్ పెట్టడానికి ప్రపంచ ప్రసిద్ధ ఏర్‌లైన్స్‌లో 13 సంస్థలు తమ ఫ్లీట్‌లో స్టార్లింక్ వై–ఫై వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యాయని కంపెనీ తెలిపింది.
READ ALSO: Telangana Rising : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు భారీ ఏర్పాట్లు
ఎమిరేట్స్, బ్రిటిష్ ఎయిర్వేస్, ఖతార్ ఎయిర్వేస్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు ఇప్పటికే ఉచిత స్టార్లింక్ ఆన్‌బోర్డ్ ఇంటర్నెట్‌ను ప్రయాణికులకు అందించే ప్రక్రియను ప్రారంభించాయి. స్టార్లింక్ శాటిలైట్ సిస్టమ్ అందించే 250 Mbps వరకు వేగం విమాన ప్రయాణికుల అనుభవాన్ని పూర్తిగా మార్చివేయనుంది. అలాగే ఎమిరేట్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, ఖతార్ ఎయిర్‌వేస్, బ్రిటిష్ ఎయిర్‌వేస్, వర్జిన్ అట్లాంటిక్, ఎయిర్‌బాల్టిక్, ఎయిర్ ఫ్రాన్స్, ఎయిర్ న్యూజిలాండ్, హవాయి ఎయిర్‌లైన్స్, అలాస్కా ఎయిర్‌లైన్స్, SAS, వెస్ట్‌జెట్, ఫ్లైదుబాయ్ వంటి ఎర్‌లైన్స్ స్టార్లింక్ సేవలను అందిచనున్నాయి.
ఈ వేగంతో ప్రయాణికులు విమానం ఎగురుతున్నప్పటికీ
– Netflix, YouTube లాంటి ప్లాట్‌ఫార్మ్‌లలో వీడియో స్ట్రీమింగ్,
– ఆన్‌లైన్ మల్టీప్లేయర్ గేమింగ్,
– హై-క్వాలిటీ వీడియో కాల్స్
లాంటివన్నీ ఎటువంటి ల్యాగ్ లేకుండా ఉపయోగించుకోగలరని స్టార్లింక్ చెబుతుంది.
ఎలోన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్..
ఈ స్టార్‌లింక్ కంపెనీ అనేది ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ కంపెనీ. ఈ స్టార్‌లింక్ కంపెనీ అనేది స్పేస్‌ఎక్స్ ద్వారా ఉపగ్రహ ఇంటర్నెట్ సేవను అందిస్తుంది. ఇది హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ను అందించడానికి వేలాది తక్కువ భూమి కక్ష్య ఉపగ్రహాల నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుంది. స్టార్‌లింక్ సర్వీస్ విమాన ప్రయాణీకులకు 100, 250Mbps మధ్య డౌన్‌లోడ్ వేగాన్ని (గరిష్టంగా 450Mbps వరకు), 25Mbps వరకు అప్‌లోడ్ వేగాన్ని, 99ms కంటే తక్కువ జాప్యాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతుంది. స్టార్‌లింక్‌కి కనెక్ట్ అయిన ప్రయాణీకులు ఒకేసారి వీడియోలను ప్రసారం చేయవచ్చు, ఆన్‌లైన్‌లో వీడియో కాల్‌లు, గేమ్‌లను కూడా ఆడవచ్చు. స్టార్లింక్ లో-లేటెన్సీ శాటిలైట్ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా విమానాల్లో కనెక్టివిటీలో విప్లవాత్మక మార్పు తీసుకురానుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యాలను పెంచేందుకు ఇది కీలక అడుగుగా మారుతుందని ఏర్‌లైన్స్ సంస్థల అంచనా.
READ ALSO: Tufail Ahmad Arrest: ఢిల్లీ కారు పేలుడు కేసులో మరొకరు అరెస్ట్.. SIA అదుపులో ఎలక్ట్రీషియన్