Aadhaar Update: ఇదేందయ్యా ఇది.. అపార్ట్‌మెంట్స్, రెస్టారెంట్లలోకి వెళ్లాలంటే ఆధార్ కావాల్సిందేనా..?
- ఆధార్లో కీలక మార్పులు దిశగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు..
- హోటల్, రెస్టారెంట్, అపార్ట్‌మెంట్ ఇలా ఎక్కడికి వెళ్లినా ఆధార్ యాక్సెస్ తప్పనిసరి చేసే ఛాన్స్..
- ఆధార్‌లోని వ్యక్తిగత సమాచారం చోరీ కాకుండా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadhaar Update: ఆధార్ లో కీలక మార్పులు దిశగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీంతో హోటల్, రెస్టారెంట్, అపార్ట్‌మెంట్ ఇలా ఎక్కడికి వెళ్లినా ఆధార్ యాక్సెస్ తప్పనిసరి అయ్యే ఛాన్స్ ఉంది. ఆ దిశగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా త్వరలో నూతన విధానం తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. అదే ఆఫ్‌లైన్ వెరిఫికేషన్.. దీనికి సంబంధించి కొత్త యాప్‌ను తీసుకొస్తున్నట్లు ఇటీవలే తెలియజేసింది. అయితే, ఇప్పుడు చాలా ప్రదేశాల్లో ఆధార్ కార్డు తప్పనిసరి అనే రూల్ ఉంది. అలాంటి చోట ఒరిజినల్ ఆధార్‌ను చూపించడంతో పాటు జిరాక్స్ కాపీని ఇవ్వాల్సి పరిస్థితి నెలకొంది. దీంతో వ్యక్తులకు సంబంధించిన కీలక సమాచారం దుర్వినియోగం అవుతుంది. కాబట్టి, దీన్ని నివారించానికి ఆధార్‌పై ఎలాంటి వివరాలు లేకుండా కేవలం క్యూఆర్ కోడ్, ఫొటో మాత్రమే ఉండేలా మార్పులు చేసేందుకు కేంద్రం యోచిస్తుంది. అలాగే, ఆఫ్‌లైన్ ఐడీ చెక్‌ను తీసుకు వస్తే ఆధార్ హార్డ్ కాపీలు చూపించాల్సిన అవసరం ఉండదని యూఐడీఏఐ పేర్కొంటుంది.
Read Also: Telangana Rising : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు భారీ ఏర్పాట్లు
Also Read
- Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
కొత్త ఆఫ్‌లైన్ ధ్రువీకరణ వ్యవస్థ..
అయితే, UIDAI అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. కొత్త ఆఫ్‌లైన్ ధ్రువీకరణ వ్యవస్థను పూర్తిగా క్యూర్ కోడ్ ఆధారంగా తయారు చేస్తారు. ప్రూఫ్ ఆఫ్ ప్రజెన్స్ అనే కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తారు. UIDAI సర్వర్లకు కనెక్ట్ కాకుండానే ముఖాన్ని స్కాన్ చేసి వ్యక్తిని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం బ్యాంకులు ఉపయోగిస్తున్న ఫేస్ అథెంటికేషన్ కంటే భిన్నంగా ఉంటుంది. యాప్ రిలీజ్ అయ్యాక ఈ విధానం ఎలా వర్క్ చేస్తుందో మరింత క్లారిటీ రానుంది.
ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ ఎక్కడెక్కడ?
ఇక, ఈ ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ విధానం అమల్లోకి వస్తే హోటల్స్, రెస్టారెంట్లు, లాడ్జీలు, గేటెడ్ కమ్యూనిటీలు, ఆఫీసులు, డేటా సెంటర్లు, హస్పటల్స్, పరీక్షల్లో విద్యార్థులు, సినిమా హాళ్లు, స్టేడియాలు, కచేరీలు.. ఇలా అనేక చోట్ల ఆధార్ యాక్సెస్‌తో ఎంట్రీకి ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన రూల్స్ ను UIDAI త్వరలో విడుదల చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.
Read Also: Tufail Ahmad Arrest: ఢిల్లీ కారు పేలుడు కేసులో మరొకరు అరెస్ట్.. SIA అదుపులో ఎలక్ట్రీషియన్
ఎవరైనా అప్లై చేసుకోవచ్చు
కాగా, చట్టపరంగా రిజిస్టర్ అయిన ఏ సంస్థ అయినా ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ సీకింగ్ ఎంటీటీగా మారడానికి అవకాశం ఉంది. దాని కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్ బోర్డింగ్ ప్రక్రియలో డాక్యుమెంట్ల ధ్రువీకరణ, సాంకేతికత అనుసంధానం, క్యూఆర్ కోడ్‌ల జనరేషన్ వంటివి తప్పనిసరిగా ఉంటాయి. దీనికి నామమాత్రపు ఫీజు వసూలు చేస్తామని UIDAI వెల్లడించింది. అయితే, ప్రస్తుతానికి ఈ యాప్ టెస్టింగ్ అంతిమ దశలో ఉంది. త్వరలో ఇది అందుబాటులోకి రానుందని అధికారులు చెప్పారు.
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!