తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. తెలంగాణలో గెలిచిన బీజేపీ అభ్యర్థుల మల్క కొమరయ్య, అంజిరెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. బీజేపీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలతో కలిసి పని చేస్తున్న తమ కార్యకర్తలను చూసి గర్విస్తున్నట్లు తెలిపారు.
అంతర్జాతీయ మహిళల అండర్-19 క్రికెట్ కప్ చరిత్రలో మొట్టమొదటి సెంచరీని నమోదు చేసి, చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. ఆమె మరింత ఉన్నతస్థాయికి వెళ్లాలని.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ప్లేయర్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. త్రిష సాధించిన సెంచరీ.. క్రీడల్లో రాణించాలనుకుంటున్న ఎంతోమంది ఆడబిడ్డలకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు.
నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ వరించిన సంగతి తెలిసిందే.. నటుడిగా, నిర్మాతగా, సమాజ సేవలో చేసిన అద్భుత కృషికి ఈ అవార్డు దక్కింది. తెలుగు సినిమా రంగానికి విశేష కృషి చేసిన నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు ప్రదానం చేయడంపై సినీ ప్రముఖులతో పాటు.. రాజకీయ ప్రముఖులు కూడా అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మహాయుతీ కూటమి చారిత్రాత్మక విజయానికి ఆయన 'X' వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ నేతృత్వాన్ని ప్రజలు నమ్మి ఇచ్చిన విజయం.. మోడీ పరివర్తనాత్మక ఆలోచనలు, వికసిత భారత్‌ను సాధించే విధానాలను ప్రజలు నమ్మారని చంద్రబాబు పేర్కొన్నారు.
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను తిస్మా ప్రతినిధులు అభినందించారు. విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడం సాహసోపేత నిర్ణయం అని ఐరన్, స్టీల్ అసోసియేషన్ అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపీతమైనదని పరిశ్రమల యజమానులు తెలిపారు. చార్జీలు పెంచితే రాష్ట్రాల్లోని స్టీల్, ఐరన్ పరిశ్రమలు మూసి వేసుకునే పరిస్థితి ఏర్పడేదని వివరించారు. ఈ విషయం పై బుధవారం ఐరన్ అండ్ స్టీల్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్ (tisma)…
అనేక రోజుల రాజకీయ గందరగోళం తర్వాత బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. దేశంలోని తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
సంక్షోభం నుంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. ఇందుకు లైన్ మెన్ రామయ్య చేసిన సాహసమే ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన కొనియాడారు. ప్రజావసరాలను తీర్చడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మరోసారి నిరూపించామని చెప్పారు.
D. Sridhar Babu: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
రష్యా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. వరుసగా ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్ గెలుపొందారు. ఈ మేరకు ‘ఎక్స్’ ట్విట్టర్ వేదికగా పుతిన్‌కు మోడీ విషెస్ చెప్పారు.