Thirumala: తిరుమల ఘాట్ రోడ్డులో మహాశాంతి హోమం.. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ఇటీవలే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు టీటీడీ మహాశాంతి హోమం జరిపించింది. అయితే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఎవరూ చనిపోలేదు కానీ.. వాహనాలు పాడైపోయాయి. అంతేకాకుండా భక్తులు గాయాలపాలయ్యారు. అయితే ఆ వెంకటేశ్వరస్వామి చల్లని చూపు వల్లనే భక్తులకు ఎలాంటి ఆపద జరగడం లేదని తెలిపారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. అయితే ఈ హోమం ద్వారా ఎలాంటి ప్రమాదాలు, ఆపదలు కలుగుకుండా నివారణ చేయొచ్చని.. అందుకే మహాశాంతి హోమం జరిపించినట్లు ఈవో తెలిపారు.
Read Also: Prabhas Dubbing: ప్రభాస్ పాత్రకి డబ్బింగ్ చెప్పిన పవన్ కళ్యాణ్ విలన్.. ఎవరో తెలుసా?
Also Read
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్‌పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
బుధవారం డౌన్ ఘాట్ రోడ్డులోని ఏడో మైలు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర మహా శాంతి హోమం జరిపారు. ఈ కార్యక్రమంలో ఈవో పాల్గొన్నారు. ఘాట్ రోడ్లలో వరుస ప్రమాదాల్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో పాటుగా.. మరికొన్ని ప్రమాదాలు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఘటనల అనంతరం ఘాట్ రోడ్డు ప్రమాదాలను ఎలా అధిగమించాలనే అంశంపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్టీసీ ఆర్ఎంలతో సమావేశం నిర్వహించినట్లు ఈవో చెప్పారు. అదే సమయంలో, భక్తుల భద్రత కోసం శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామివారి అనుగ్రహం కోరుతూ హోమం నిర్వహించాలని టీటీడీ ఆగమ సలహాదారులు సూచించారన్నారు. అందుకోసమని ఘాట్ రోడ్లలో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉండేందుకు.. మహా శాంతి హోమం నిర్వహించిన్నట్లు ఈవో తెలిపారు.
Read Also: Adipurush Collections: ఆదిపురుష్.. ఓపెనింగ్స్‌తో ఆలిండియా రికార్డుల బద్దలు?
ఆగమ సలహాదారు శ్రీ మోహన రంగాచార్యులు, తిరుమల ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ.. ఆపదలు, భయాందోళనలు, అంటువ్యాధులు మొదలైన అశుభాలు కలిగినప్పుడు మహాశాంతి హోమం నిర్వహించాలని తెలిపారు. ఈ హోమం నిర్వహించడం ద్వారా ఎటువంటి ఆపదలు కలుగకుండా నివారణ చేయవచ్చని వారు వివరించారు. ఉదయం 8 గంటలకు విష్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, పంచగవ్యారాధన, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ట, విశేష హోమంలతో మహా శాంతి హోమం ప్రారంభమై మహా పూర్ణాహుతితో ముగిసింది.
తాజావార్తలు
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్‌పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్‌కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!