Sharad Kelkar Gave Voice to Prabhas Role in Adipurush: మరి కొద్ది గంటల వ్యవధిలో ప్రభాస్ రఘురాముడి పాత్రలో నటించిన ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పుడంటే మేనియా ఒక రేంజ్ లో ఉంది. కానీ నిజానికి సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా గురించి చర్చ జరుగుతూనే ఉంది. కేవలం ప్రభాస్ అభిమానులు, సినీ అభిమానులు మాత్రమే కాదు యావత్ భారత దేశ ప్రజలందరూ ఈ భారీ పాన్ ఇండియన్ మూవీ కోసం అత్యంత ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తెలుగులో ప్రభాస్ డబ్బింగ్ చెప్పారు. అలాగే తమిళ ఇతర భాషల్లో వీలును బట్టి అక్కడి నటులు డబ్బింగ్ చెప్పారు. అయితే ఈ సినిమాకి హిందీలో ఎవరు డబ్బింగ్ చెప్పారు అనే విషయం మీద చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈ విషయాన్ని ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. హిందీలో పలు సినిమాల్లో నటించిన శరత్ కేల్కర్ అనే నటుడు ప్రభాస్ కి డబ్బింగ్ చెప్పారు.
Also Read: Adipurush Collections: ఆదిపురుష్.. ఓపెనింగ్స్‌తో ఆలిండియా రికార్డుల బద్దలు?
గతంలోనే ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ ఈ సినిమా అద్భుతంగా వచ్చింది, తుది మెరుగులు దిద్దిన తర్వాత థియేటర్స్ లో సినిమాను చూసి ఒక్కరు ఆశ్చర్యపోతారంటూ కామెంట్లు చేశారు. తాను డబ్బింగ్ చెప్పడం కోసం ముందే ఆదిపురుష్ సినిమా చూశాను కాబట్టి తాను ఇంత ధైర్యంగా చెబుతున్నానని, సినిమా అద్భుతంగా వచ్చిందని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. సినిమా కంటెంట్ తో పాటు తెరకెక్కించిన విధానం కూడా అద్భుతంగా ఉందని ఆయన కామెంట్లు చేశారు. డబ్బింగ్ పూర్తి చేసిన తర్వాత తన పనితనం మెచ్చి ప్రభాస్ అభినందించారని ఆప్యాయంగా హత్తుకుని డబ్బింగ్ బాగా చెప్పావని మెచ్చుకున్నారు అని చెప్పుకొచ్చారు. నిజానికి శరత్ కేల్కర్ హిందీ మరాఠీ సినిమాల్లో ఎక్కువగా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. వాయిస్ ఆర్టిస్ట్ గా కూడా ఆయనకి మంచి పేరు ఉంది. హిందీ వెర్షన్ కి ప్రభాస్ గొంతు సూట్ అవ్వకపోవడంతో శరత్ కేల్కర్ ప్రభాస్ కి తన గొంతు అరువిచ్చారు.
Also Read: Adipurush: ’ఆదిపురుష్’ దెబ్బకి Book My Show సర్వర్లు క్రాష్.. ఏమన్నా క్రేజా ఇది?
ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో రాజా భైరోం సింగ్ పాత్రతో ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ కి విలన్ పాత్రలో ఆయన కనిపించారు. అలాగే ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో కూడా ఆయన ప్రియమణితో కలిసి పనిచేసే వ్యక్తిగా ఫ్యామిలీ మెన్ సిరీస్ చూసిన అందరికీ గుర్తుండే ఉంటాడు అవి మాత్రమే కాదు మరిన్ని వెబ్ సిరీస్ లలో, సినిమాలలో, సీరియల్స్ లో కూడా ఆయన భాగమయ్యారు. హిందీ చత్రపతిలో కూడా ఆయన భవాని అనే పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఇక ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి మొదటి భాగానికి రెండో భాగానికి ఆయన ప్రభాస్ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. అలాగే గద్దలకొండ గణేష్ సినిమా హిందీలో డబ్బింగ్ అయిన సమయంలో వరుణ్ తేజ్ కి గాత్రం అందించారు. ఇక దసరా సినిమాకి గాను నానికి కూడా వాయిస్ ఇచ్చింది ఆయనే కావడం గమనార్హం. ఇప్పుడు ఆదిపురుష్ సినిమాకి కూడా ఆయన వాయిస్ ఇవ్వడంతో ప్రభాస్ అభిమానులైతే సెంటిమెంట్ గా భావిస్తున్నారు. బాహుబలి, బాహుబలి రెండో భాగం సూపర్ హిట్ కావడమే కాక గద్దల కొండ గణేష్, దసరా సినిమాలు కూడా సూపర్ హిట్ లో అవడంతో ఇప్పుడు ఆదిపురుష్ సినిమాకి కూడా ఆయన సెంటిమెంట్ తమకు కలిసొస్తుందని అంచనాలు వేసుకుంటున్నారు.