AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Movie Ticket Prices: సినిమా రిలీజ్ సమయంలో టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వ అనుమతుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి త్వరలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెటింగ్ విధానంలో కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పటివరకు ప్రతి సినిమా కోసం ప్రత్యేకంగా టికెట్ ధరల పెంపు ప్రతిపాదనలను పరిశీలించి అనుమతి ఇవ్వాల్సి రావడంతో ప్రభుత్వంపై కూడా అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు, పంపిణీదారులకు మరింత స్వేచ్ఛ కల్పించేలా కొత్త జీవో తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఏ సినిమా టికెట్ ధరలను పెంచాలన్నా ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలయ్యే సమయంలో టికెట్ ధరల పెంపు కోసం ప్రత్యేక జీవోలు జారీ చేయాల్సి వస్తోంది. దీంతో ప్రతి విడుదల సమయంలో ఇదే ప్రక్రియ పునరావృతమవుతోంది. ఈ పరిస్థితిని సరళీకరించేందుకు ప్రభుత్వం శాశ్వత విధానాన్ని తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
ఇప్పటికే తెలంగాణలో ఇలాంటి విధానమే అమల్లో ఉంది. అక్కడ ప్రభుత్వం ముందస్తు అనుమతి అవసరం లేకుండానే నిర్ణయించిన పరిమితి వరకు నిర్మాతలు టికెట్ ధరలను నిర్ణయించుకునే వెసులుబాటు ఉంది. ఇదే తరహా విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రతి సినిమాకు వేర్వేరుగా ప్రభుత్వాన్ని ఆశ్రయించాల్సిన అవసరం తగ్గే అవకాశం ఉంది.
అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రతిపాదనలో కొన్ని మార్పులు ఉండొచ్చని సమాచారం. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ప్రతిపాదన ప్రకారం, నిర్ణయించిన పరిధిలో సినిమా టికెట్ ధరలను నిర్మాతలు, పంపిణీదారులే నిర్ణయించుకునే అవకాశం కల్పించవచ్చని తెలుస్తోంది. టికెట్ ధరలను రూ.100 నుంచి రూ.1000 మధ్య నిర్ణయించే విధంగా ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించే అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.
ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా తాజాగా ప్రస్తావించారు. ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, కొత్త జీవోపై ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తోందని, అయితే అమలులోకి రావడానికి కొంత సమయం పట్టే అవకాశముందని ఆయన తెలిపారు. అధికారిక ఆమోదం లభించిన తర్వాత కొత్త విధానం అమల్లోకి వస్తుందని ఆయన సంకేతాలు ఇచ్చారు.
ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే సినిమా పరిశ్రమకు పరిపాలనా పరంగా గణనీయమైన ఊరట లభించే అవకాశం ఉంది. ప్రతి సినిమా విడుదలకు ముందు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. నిర్ణయించిన నిబంధనల పరిధిలో నిర్మాతలు, పంపిణీదారులే టికెట్ ధరలను నిర్ణయించుకునే వెసులుబాటు లభిస్తుంది. అయితే ప్రేక్షకులపై ధరల భారం ఎంత మేరకు పడుతుంది, ప్రభుత్వం ఎలాంటి గరిష్ఠ పరిమితిని ఖరారు చేస్తుంది వంటి అంశాలపై పూర్తి స్పష్టత రావాలంటే అధికారిక జీవో విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..