తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. రెండో ఘాట్ రోడ్డులో భక్తులతో వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. హరిణి దాటిన తరువాత డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో.. బస్సు రోడ్డుకు అడ్డంగా ఉండిపోయింది.
Tirumala Landslides: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది.
శుక్రవారం తిరుమల అలిపిరి నడకదారిలో శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా.. మూడేళ్ల చిన్నారి లక్షితను చిరుత ఎత్తుకెళ్లి బలి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇవాళ తిరుమల నడకమార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు కొందరు భక్తులు చెప్పారు. 2450 మెట్టు వద్ద చిరుత కనిపించందంటూ అధికారులకు సమాచారమిచ్చారు.
తిరుమల ఘాట్ రోడ్డులో ఇటీవలే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు టీటీడీ మహాశాంతి హోమం జరిపించింది. అయితే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఎవరూ చనిపోలేదు కానీ.. వాహనాలు పాడైపోయాయి. అంతేకాకుండా భక్తులు గాయాలపాలయ్యారు. అయితే ఆ వెంకటేశ్వరస్వామి చల్లని చూపు వల్లనే భక్తులకు ఎలాంటి ఆపద జరగడం లేదని తెలిపారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.
తిరుమలలో కురిసిన భారీవర్షానికి భక్తులు తడిసిముద్దయ్యారు. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులు గురి అయ్యారు.. సెలవు రోజు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి వైకుంఠం కాంప్లెక్స్‌కు వెళ్లే భక్తులతో పాటుగా దర్శనం తర్వాత బయటకు వచ్చే భక్తులు తడిసిపోయారు. భారీవర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాఢ వీధులు, లడ్డూ వితరణ కేంద్రాల్లో స్వల్పంగా వర్షపు నీరు చేరుకుంది. వాన నీటిని బయటకు తోడే పనిలో…
వైకుంఠ ఏకాదశిలోపు ఘాటు రోడ్ పనులు పూర్తిచేస్తామంటోంది టీటీడీ. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామంటోంది. తుఫాన్ కారణంగా ఏర్పడిన భారీ వర్షాలకు ఘాట్ రోడ్డు పాడైంది. తిరుమల రెండో ఘాట్ మరమ్మతులు ఈ నెలాఖరులోపు పూర్తిచేసి, వైకుంఠ ఏకాదశిలోపు వాహన రాకపోకలకు అనుమతివ్వాలని ఇంజనీరింగ్ అధికారులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. 7,8,9,14,15వ కిలోమీటర్ల వద్ద త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఐఐటీ…
భారీవర్షాల కారణంగా తిరుమలకు రాకపోకలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో తిరుమల ఘాట్ రోడ్డులో తనిఖీలు నిర్వహించారు ఇఓ జవహర్ రెడ్డి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. సోషల్ మీడియా సమాచారం విశ్వసించవద్దని, వర్షం వల్ల దర్శనానికి రాలేకపోతే.. తర్వాత దర్శించుకునే అవకాశం ఇస్తామన్నారు జవహర్ రెడ్డి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తిరుమలలో భక్తులకు అన్నప్రసాద సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. తిరుపతిలో భక్తులకు వసతి సౌకర్యం కల్పించామని, వర్షం కారణంగా దర్శనానికి రాలేని భక్తులను తరువాత రోజులలో దర్శనానికి…
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. రెండు రోజుల పాటు.. తిరుమలకు వెళ్లే రెండు నడకదారులను మూసివేయాలని నిర్ణయించింది టీటీడీ.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన టీటీడీ.. ముందస్తు చర్యలు చేపట్టింది.. అందులో భాగంగా.. బుధ, గురువారాల్లో తిరుమలకు వెళ్లే రెండు నడకదారులైన అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది… వర్షాల నేపథ్యంలో.. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ…