Crime News: సమాజంలో మానవ సంబంధాలు దారుణంగా తయారయ్యాయి. అనుమానం పెనుభూతమై ఇద్దరు దంపతుల దాంపత్యంలో చిచ్చు చెలరేగింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. బిడ్డను నేలకేసి కొట్టిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో తన భార్యతో గొడవపడి తన పసికందుని ఓ తండ్రి నేలకేసి కొట్టాడు. ఈ సంఘటన శనివారం సాయంత్రం ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో జరిగింది.
Read Also: Bribery Head Master : మీరే లంచం తీసుకుంటే ఎలా మాస్టారూ.. ఐదేళ్లు జైల్లో ఉండాల్సి వచ్చిందిగా
అమరావతికి చెందిన నిందితుడు 2020లో వివాహం చేసుకున్నప్పటి నుండి అతని భార్యను అనుమానించేవాడు. డిసెంబర్ 30 న తన కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత చూడటానికి వచ్చి ఆమెతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే కోపంతో కొడుకును నేల పైకి విసిరాడు. ఆస్పత్రిలో గొడవపెడుతుండగా అక్కడున్న సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఆ పిల్లాడి పరిస్థితి నిలకడగా ఉందని అజ్ని పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. నిందితుడిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Huge Explosion: మహారాష్ట్రలో ఘోరం.. కెమికల్ ప్లాంట్లో పేలిన బాయిలర్