Huge Explosion: మహారాష్ట్రలో ఘోరం.. కెమికల్ ప్లాంట్లో పేలిన బాయిలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huge Explosion: మహారాష్ట్రలోని నాసిక్‌లో భారీ పేలుడు సంభవించింది. ఓ కెమికల్ ప్లాంట్లో బాయిలర్ బాంబులా పేలింది. ఈ ఘటనతో చుట్టుప్రక్కల ప్రజలు భయాందోళన చెందారు. ముండేగావ్ గ్రామంలోని జిందాల్ గ్రూప్ పోలిథిన్ తయారీ యూనిట్‌లో మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. మంటల్లో చిక్కుకుని ఒకరు మరణించారు. మరో 19మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం తెలుస్తోంది. కెమికల్ ప్లాంట్ బాయిలర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్దఎత్తున పొగలు చుట్టుపక్కలకు వ్యాపించాయి.
Read Also: Fund For Orphans: హిమాచల్ ప్రదేశ్ సీఎం న్యూ ఇయర్ గిఫ్ట్.. అనాథలకు ప్రత్యేక నిధి
Also Read
- India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
పలువురు ఫ్యాక్టరీలో చిక్కుకుపోవడంతో అధికారులు తక్షణ సహాయక చర్చలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వారి వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారత వాయుసేన హెలికాప్టర్‌ను కూడా రంగంలోకి దించారు. తీవ్రంగా గాయపడిన ఒక మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూసిందని, వర్కర్లు, సూపర్‌వైజర్ సహా 19 మంది గాయపడ్డారని నాసిక్ ఎస్‌పీ షాహ్జి ఉమాప్ తెలిపారు. నాసిక్ ఫైర్ యాక్సిడెంట్ ఘటనపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీలో చిక్కుకుపోయిన వారిని, గాయపడిన వారిని ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. కాగా, ప్రమాదానికి కారణాలేమిటో తెలియాల్సి ఉంది.
Massive fire breakout at one of the big steel plant on Nashik Highway.#firebreakout #nashikhighway #SteelPlant pic.twitter.com/u18Ffd6w9o
— Vivek Gupta (@imvivekgupta) January 1, 2023
తాజావార్తలు
-
Redmi Note 15 SE 5G: రెడ్ మీ Note 15 SE 5G.. 120Hz Curved AMOLED డిస్‌ప్లే, 5800mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!