Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లాలో బాల్య ప్రేమ వ్యవహారం కలకలం రేపింది. జడ్చర్ల మండలం శంకరాయపల్లి తండాకు చెందిన 9వ తరగతి చదువుతున్న బాలుడితో, ఇంటర్ చదువుతున్న బాలిక మధ్య ప్రేమాయణం సాగినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం నెల రోజుల క్రితమే పెద్దల దృష్టికి రాగా.. గ్రామస్థుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. అయితే పంచాయితీ జరిగిన మరుసటి రోజే ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి వారి ఆచూకీ తెలియక ఆందోళనకు గురైన కుటుంబాలు, చివరకు నిన్న జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. పోలీసుల విచారణలో ప్రస్తుతం బాలిక ఆరు నెలల గర్భవతిగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇద్దరూ మైనర్లు కావడంతో చట్టపరమైన నిబంధనల మేరకు వారిని హోమ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సంఘటన బాల్య వివాహాలు, బాల్య ప్రేమ వ్యవహారాలపై మరోసారి చర్చకు దారితీసింది.
READ MORE: Suma Kanakala : ప్రభాస్, పవన్ కళ్యాణ్‌పై సుమ ఎమోషనల్ కామెంట్స్