Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లాలో బాల్య ప్రేమ వ్యవహారం కలకలం రేపింది. జడ్చర్ల మండలం శంకరాయపల్లి తండాకు చెందిన 9వ తరగతి చదువుతున్న బాలుడితో, ఇంటర్ చదువుతున్న బాలిక మధ్య ప్రేమాయణం సాగినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం నెల రోజుల క్రితమే పెద్దల దృష్టికి రాగా.. గ్రామస్థుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. అయితే పంచాయితీ జరిగిన మరుసటి రోజే ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి వారి ఆచూకీ తెలియక ఆందోళనకు…