Madhyapradesh: మధ్యప్రదేశ్‌లో ఒక వ్యక్తిపై మూత్ర విసర్జన చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేసిన కొద్ది రోజుల తర్వాత.. రాష్ట్రంలోని సెహోర్ జిల్లాలో ఒక మహిళ తన భర్తపై ఆరోపణలు చేసిన మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె తన భర్త తనతో బలవంతంగా మూత్రం తాగించాడని ఆరోపించింది. తన భర్త తనపై శారీరకంగా దాడికి పాల్పడ్డాడని మహిళ ఆరోపణలు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అందులో వ్యక్తి నేరానికి పాల్పడుతున్నట్లు కనిపించింది.
మహిళ ఫిర్యాదు మేరకు సెహోర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఆ మహిళ మాట్లాడుతూ.. “అతను (ఆమె భర్త) నన్ను కొట్టి మూత్రం తాగించాడు. దానికి నాకు న్యాయం కావాలి. నేను గతంలో చాలా బాధపడ్డాను కానీ ఫిర్యాదు చేయలేదు. ఒకసారి కిరోసిన్ పోసి నిప్పంటించడానికి ప్రయత్నించాడు కానీ నేనేమీ మాట్లాడలేదు, ఎవరికీ చెప్పలేదు. అయితే, ఈ సంఘటన నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. నా విన్నపాన్ని ఎవరూ వినకుంటే నేను ముఖ్యమంత్రితో మాట్లాడి న్యాయం చేయమని అభ్యర్థిస్తాను” అని సదరు మహిళ తెలిపింది.
Also Read: Suicide Blast: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఆత్మాహుతి దాడి.. ఆరుగురికి గాయాలు
మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ పూజా రాజ్‌పుత్ మాట్లాడుతూ.. “తన భర్త తనపై దాడి చేశాడని మహిళ ఫిర్యాదు చేసింది. సంఘటనకు సంబంధించిన వీడియోలను కూడా చూపించింది” అంటూ పోలీస్ అధికారి తెలిపారు. ఫిర్యాదు మేరకు నిందితుడైన భర్తపై ఐపీసీ సెక్షన్‌లు 498A, 324, 323, 294, 506 కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై తదుపరి విచారణ జరుగుతోందని ఆమె తెలిపారు.