కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో, నాగవంశీ నిర్మాతగా ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ అనే రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా కొంత గుర్తింపు సంపాదించారు. వీరు ఇతర సినిమాలు కూడా చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు.
Also Read:Ravi Teja: వెటకారంతో కూడిన ఫ్రెండ్‌షిప్ మాది: హీరో రవితేజ
ఈ సీక్వెల్ ఆసక్తి రేకెత్తిస్తోంది, ఎందుకంటే ఈసారి గతంలో లాగా హీరోలు వీరు ఉండరు. ‘మ్యాడ్ జూనియర్స్’ పేరుతో వారి చిన్నతనాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే హీరోల చిన్నతనాన్ని చూపిస్తారా లేక వేరే ఒక స్కూల్ గ్యాంగ్‌తో కామెడీ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారా అనే విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు.
Also Read:Secunderabad: ‘సికింద్రాబాద్ బచావో’!.. నగరంలో పొలిటికల్ వార్..
ప్రస్తుతం ‘బుల్లి రాజు’ లాంటి పాత్రలతో దూసుకుపోతున్న రేవంత్ సహా, మరికొంత మంది చైల్డ్ ఆర్టిస్టులను ప్రధానంగా ఈ సినిమా కోసం రంగంలోకి దించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది ప్రచారమే కాగా, దాదాపుగా ఇదే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రస్తుతానికి నాగవంశీ టీం ఖరారు చేయలేదు కానీ, ఫిలింనగర్ వర్గాల్లో ఈ మేరకు ప్రచారం అయితే జరుగుతోంది.