టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా ఒకరాజు’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం, షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మధ్య మధ్యలో చిన్న చిన్న అప్‌డేట్స్‌తోనే సరిపెట్టుకుంది. ఇంతకు ముందు రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో (3 నిమిషాల 2 సెకన్ల నిడివితో) నవీన్ స్టైల్ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. “ముకేశ్…