సామాన్యుని గమ్యానికి చేర్చేది సైకిల్. సాధకుడుని విజయానికి చేర్చేది సైకిల్. శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేది సైకిల్. ఆరోగ్యమైన రాజకీయాలకు ఉజ్వల భవిష్యత్తుకు నమ్మకమైన సైకిల్. ఎమ్మిగనూరు నియోజకవర్గం రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు తోనే సాద్యం అని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమంలో భాగంగా మాచాని సోమనాథ్ గారు ఎమ్మిగనూరు నుండి సైకిల్ యాత్ర ప్రారంభించి నందవరం మండలంలోని ముగతి, నందవరం, కనకవీడు, త్సళ్లకుడ్లుర్, తిమ్మాపురం లో ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో లోని 6 గ్యారెంటీలను వివరిస్తూ తమ సమస్యల గురించి తెలుసుకొని టీడీపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు.
BJP: లోక్‌సభ ఎన్నికల కసరత్తు.. గురువారం 100 మందితో బీజేపీ తొలి జాబితా.!
ఇదిలా ఉంటే.. గత రెండు రోజుల క్రితం ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గొనెగండ్ల మండలంలోని బి.అగ్రహారంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా టీడీపీ నేత మాచాని సోమనాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే తెలుగు దేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడితోనే సాధ్యమని తెలిపారు. బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. సంపదను ఎలా సృష్టించాలి అన్న లక్ష్యాలతో చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారని టీడీపీ డాక్టర్ మాచాని సోమనాథ్ వెల్లడించారు.
Tamil Nadu: ‘‘బురఖా మీ అందమైన ముఖాన్ని దాచిపెడుతోంది’’.. పోలీస్ అధికారి సస్పెండ్..