FSSAI give 5 star rating for LULU Mall: హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో ఉన్న లులు మాల్‌కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నుంచి 5 స్టార్ రేటింగ్ లభించింది. సినిమా హాల్, బహుళ వంటకాల ఫుడ్ కోర్ట్ వంటి అనేక రకాల సౌకర్యాలను కలిగి ఉన్న హైపర్‌మార్కెట్, ఆహార నిర్వహణ, తయారీ అలాగే నిల్వలో అత్యుత్తమ అభ్యాసాల కోసం ఈ 5 స్టార్ రేటింగ్ ను అందుకుంది. హైదరాబాద్ లోని లులు మాల్‌లో ఫుడ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఆహార భద్రత నిర్వహణపై దృష్టి సారించి, సిబ్బందికి క్రమ శిక్షణా కార్యక్రమాలను కలిగి ఉన్న సమగ్ర ఆహార భద్రత నిర్వహణ వ్యవస్థను హైపర్ మార్కెట్ అమలు చేసింది. గతేడాది హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో లులు మాల్ ను లులు గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీ ఎంఏ సమక్షంలో అప్పటి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు.
Liquor in Goa: షాకింగ్.. గోవాలో కూడా మద్యపాన నిషేధం
ఐదు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇది హైదరాబాద్‌లోని అతిపెద్ద షాపింగ్ గమ్యస్థానాలలో ఒకటి. ఇదివరకు తెలంగాణ రాష్ట్రానికి లులు గ్రూప్ కట్టుబడి ఉన్న రూ. 500 కోట్ల పెట్టుబడిలో భాగంగా దీనిని నిర్మించారు. భారతదేశంలో లులు మాల్ ఉన్న ఆరవ నగరంగా హైదరాబాద్ నిలిచింది. ప్రస్తుతం, లులు మాల్స్ బెంగళూరు, కోయంబత్తూరు, కొచ్చి, లక్నో, తిరువనంతపురం, హైదరాబాద్ ఆరు భారతీయ నగరాల్లో మాత్రమే ఉన్నాయి.లులు మాల్ హైదరాబాద్ లోని అతిపెద్ద షాపింగ్ మాల్స్ లో ఒకటి అయినప్పటికీ నగరం ఇప్పటికే అనేక ప్రసిద్ధి చెందిన షాపింగ్ మాల్స్ ని కలిగి ఉంది.
Suryakumar Yadav: నేను వేసిన చివరి ఓవర్ మ్యాజిక్ కంటే.. మా కుర్రాళ్ల ఆటే ఆకర్షించింది: సూర్య