లులూ మాల్ గొంతెమ్మ కోర్కెలపై కూటమి పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. ఏపీకి ఆహ్వానించిన ప్రభుత్వమే.. ఇప్పుడు లులూపై గుర్రుగా ఉంది. రాష్ట్రానికి తానే అవసరమన్న ధోరణిలో లులూ ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసంతృత్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లులూకు ప్రభుత్వం ఇచ్చే భూముల విలువ, రాయితీలు ఎన్ని?.. లులూ ఇచ్చే ఉద్యోగాలు ఎన్ని? అని కేబినెట్‌లో డిప్యూటీ సీఎం ప్రశ్నించినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్న లులూ.. తిరిగి ప్రభుత్వానికే షరతులు పెట్టడం…
FSSAI give 5 star rating for LULU Mall: హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో ఉన్న లులు మాల్‌కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నుంచి 5 స్టార్ రేటింగ్ లభించింది. సినిమా హాల్, బహుళ వంటకాల ఫుడ్ కోర్ట్ వంటి అనేక రకాల సౌకర్యాలను కలిగి ఉన్న హైపర్‌మార్కెట్, ఆహార నిర్వహణ, తయారీ అలాగే నిల్వలో అత్యుత్తమ అభ్యాసాల కోసం ఈ 5 స్టార్ రేటింగ్ ను అందుకుంది. హైదరాబాద్…
ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగేస్తారనే నానుడి ఇప్పటికీ ఉంది. రియాలిటీలో అది సాధ్యపడదు కానీ, దానికి తగినట్టు చాలా సందర్భాలే వెలుగు చూశాయి. ఏదైనా ఒక భారీ ఆఫర్ ప్రకటిస్తే చాలు.. జనాలు పోటెత్తిపోతారు. అప్పట్లో జియో సిమ్స్ అందుబాటులో వచ్చినప్పుడు, దేశవ్యాప్తంగా జనాలు ఎలా ఎగబడ్డారో చూసే ఉంటారు. అంతెందుకు.. హైదరాబాద్‌లోనే కొన్ని షాప్స్‌లో ఫలానా డిస్కౌంట్స్ ప్రకటించినప్పుడు దండయాత్రలే చేశారు. ఇప్పుడు కేరళలోని లులు మాల్‌లో అలాంటి దృశ్యాలే కనువిందు చేశాయి. మొత్తం…