తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోందన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ప్రచారం పొందుతున్న ‘ఇరుంబుకై మాయావి’ అని నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్‌ను మొదట హీరో సూర్యతో చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేశాడు లోకేష్. అత్యంత భారీ బడ్జెట్ లో తమిల్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ సినిమా చేస్తాడని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. సూర్యకి కథ వినిపించడం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా అన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ కాంబినేషన్ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు.
ఈ విషయమై లోకేష్ కనకరాజ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీ డ్రీమ్ ప్రాజెక్టును ప్రేక్షకుల అంచనాలతో సంబంధం లేకుండా చేయగలిగితే ఎలాంటి ప్రాజెక్టును ఎంచుకుంటారు అని ప్రశ్నించగా అందుకు బదులిస్తూ నా నెక్ట్స్ సినిమా అలాంటిదే అని బదులిచ్చాడు. దాంతో ఇప్పుడు అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమా లోకేష్ కనకరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని వస్తున్న ఊహాగానాలు మరింత బలంగా చేకూర్చాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు, లోకేష్ ప్రస్తుతం పని చేస్తున్న సినిమా అదే ‘ఇరుంబుకై మాయావి’ అని గట్టిగా నమ్ముతున్నారు. ఈ కాంబినేషన్ నిజమైతే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్‌గా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు. బన్నీ ప్రస్తుతం చేస్తున్న అట్లీ సినిమా సమ్మర్ కి పూర్తి అవుతుంది. ఆ వెంటనే లోకేష్ కనకరాజ్ తో సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్లబోతున్నారు. తమ హీరోతో చేయాల్సిన సినిమాను మరొక హీరోతో చేస్తున్నాడని సూర్య ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.