LIC: బిపార్జోయ్ తుఫాను బాధితులకు బీమా క్లెయిమ్‌లు చేయడానికి ఎల్‌ఐసి నిబంధనలను సులభతరం చేసింది. గుజరాత్ తీరాన్ని తాకిన ఈ తుపాను రాష్ట్రంలో భారీ విధ్వంసం సృష్టించింది. దీని ప్రభావం మహారాష్ట్ర, రాజస్థాన్ వరకు కనిపించింది. LIC నిర్ణయంతో చాలా మందికి ప్రయోజనం పొందుతుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డిఎఐ (IRDAI) మార్గదర్శకాల ప్రకారం.. ఎల్‌ఐసి శనివారం సాయంత్రం బీమా చేసిన వారికి ఉపశమనం ప్రకటించింది. దీనితో పాటు, ఎల్‌ఐసి ‘ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన’ చందాదారుల కోసం క్లెయిమ్ నిబంధనలను కూడా ప్రకటించింది.
Read Also:GVL Narasimha Rao: రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి
తుఫానులో ప్రాణనష్టం చాలా తక్కువగా ఉందని.. అయితే కంపెనీ బాధిత కుటుంబాలను చేరుస్తోందని.. తద్వారా ఈ కష్ట సమయంలో వారికి సహాయం అందించవచ్చని LIC ఒక ప్రకటనలో తెలిపింది. బీమా క్లెయిమ్‌లు ప్రజలకు సులువుగా చేరేలా డివిజన్ స్థాయిలో నోడల్ అధికారిని నామినేట్ చేసినట్లు ఎల్‌ఐసీ ప్రకటనలో పేర్కొంది. ఈ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతారు.
Read Also:Jangaon Crime: జనగామ రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణ దారుణ హత్య.. కిడ్నాప్ చేసి మరీ..
Biparjoy తుఫాను బాధితులకు సహాయం చేయడానికి LIC తన పోర్టల్‌లో ప్రత్యేక లింక్‌ను కూడా ప్రారంభించింది. ఇక్కడ సందర్శించడం ద్వారా ప్రజలు తమ క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బిపార్జోయ్ తుఫాను గురువారం గుజరాత్‌లోని కచ్ ప్రాంతాన్ని తాకింది. దీంతో ఆ ప్రాంతంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. తుఫాను గాలుల కారణంగా ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు చాలా దెబ్బతిన్నాయి. ఇటీవల ఒడిశాలోని బాలాసోర్‌లో రైలు ప్రమాదం జరిగినప్పుడు, IRDA మార్గదర్శకాలపై బీమా క్లెయిమ్‌ల నిబంధనలు, షరతులను సరళీకృతం చేసే పనిని LIC చేసింది.