ఈమధ్య చాలాసార్లు వన్య ప్రాణులు అడవులను వదిలి జనారణ్యంలోకి ప్రవేశిస్తున్న సంఘటనలు తరచూ వింటూనే ఉన్నాం. వీటిలో ముఖ్యంగా చిరుతలు, ఎలుగుబంట్లు గ్రామాల్లోకి, పట్టణాలలోకి ప్రవేశించి జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇక తాజాగా ఢిల్లీలోని రూప్ నగర్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఓ ఇంట్లోకి చిరుతపులి ప్రవేశించి ఐదుగురిని గాయపరిచిందని పొలిసు అధికారులు తెలిపారు.
Also Read: Kumari Aunty : చదువుపై కుమారి ఆంటీ ఎమోషనల్ స్పీచ్.. ఫిదా అవ్వాల్సిందే.
ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రకారం, వారు ఉదయం 6.20 గంటలకు సంఘటన గురించి సమాచారం అందుకున్నారు. దాంతో అధికారులు రెండు ఫైర్ టెండర్లను ఢిల్లీలోని వజీరాబాద్‌లోని జగత్‌పూర్ గ్రామానికి తరలించారు. అక్కడి స్థానికుల సహకారంతో అధికారులు చిరుతను ఓ గదిలో బంధించగలిగారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు. ఆ తర్వాత పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని అటవీ శాఖకు సమాచారం అందించారు.
Also Read: Kumari Aunty : చదువుపై కుమారి ఆంటీ ఎమోషనల్ స్పీచ్.. ఫిదా అవ్వాల్సిందే.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జగత్పూర్ అనే గ్రామంలోని ఓ ఇంటి పై కప్పుపై చిరుత పరుగులు తీయడాన్ని ఆ ప్రాంత స్థానికులు గమనించారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఒక చిరుత ఓ ఇంటిపై నుంచి మరో ఇంటి టెర్రస్ పైకి చిరుత దూకినట్లు గుర్తించారు అక్కడి స్థానికులు. అయితే ప్రజలు అధికారులు కలిసి ఓ ఇంటి టెర్రస్ పై ఉన్న ఓ రూమ్ లో చిరుతను బంధించి లాక్ వేశారు. ఈ ఘటనలకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Panic In North #Delhi As Leopard Enters House, Attacks 5 People
Read Here: https://t.co/6ovhWiPktP pic.twitter.com/NyyF7P9n4m
— NDTV (@ndtv) April 1, 2024