Kota Srinivasa Rao Biography: తెలుగు సినీ రంగాన్ని తన విలక్షణ నటనతో మురిపించిన ప్రఖ్యాత నటుడు కోట శ్రీనివాసరావు (83) ఈరోజు (జుయ్ 13) ఉద్యమ 4 గంటలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపై విచారం వ్యక్తం చేశారు.
Read Also:Kota Srinivasa Rao: సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.. దిగ్భ్రాంతిలో టాలీవుడ్
అయితే, కొత్త జీవన ప్రయాణం చూసినట్లయితే.. కోట శ్రీనివాసరావు 1942, జూలై 10న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. చిన్ననాటి నుంచే నాటకాలపై ఎక్కువ ఇష్టం కలిగిన కోటా, స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తుండగానే తన నటనా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకున్నారు. 1968లో రుక్మిణి దేవిను వివాహమాడిన ఆయనకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. కొడుకు కోట ప్రసాద్ 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆయనకు తీరని విషాదాన్ని మిగిల్చింది. కోట శ్రీనివాసరావు సినిమాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికై ప్రజలకు సేవ చేశారు. కళా రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా 2015లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంను ఆయనకు ప్రదానం చేసింది. అలాగే తొమ్మిది నంది పురస్కారాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.

Read Also:Girls For Sale: ఐదో సంతానంగా ఆడపిల్ల.. అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రులు
1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన కోటా.. మొదట సినిమాలను అంతగా సీరియస్ గా తీసుకోలేదు. అయితే 1986లో వచ్చిన ‘ప్రతి ఘటన’ సినిమాతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన నటనకు తిరుగే లేకుండా పోయింది. ముఖ్యంగా ‘అహ నా పెళ్లంట’ సినిమాలోని ఆయన పాత్ర, ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. కోటా శ్రీనివాసరావు – బాబూ మోహన్ జంట ప్రేక్షకుల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇద్దరూ కలిసి సుమారు 60కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. వారి జంట ఉండే సినిమా మినిమమ్ హిట్టే అనే ముద్ర ఏర్పడింది.
కోటా శ్రీనివాసరావు తన సినీ ప్రస్థానంలో 750కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మిమిక్రీ చేయగలిగే నైపుణ్యం, హావభావాలు, డైలాగ్ డెలివరీ అన్నీ కలిసి ఒక యాక్టర్ లో ఉండాల్సిన అన్ని లక్షణాలను కలిగి ఉన్నారు. పిసినారి పాత్రలు, అల్లరి తాతయ్య, అవినీతి నాయకుడు, కామెడీ విలన్, పోలీసు, మాంత్రికుడు వంటి విభిన్న పాత్రల్లో ఆయన జీవించారు. ఎస్.వి.రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు వంటి మహానటుల తర్వాత ఆ లోటును పూరించిన నటుడు కోటా శ్రీనివాసరావు. ఆయన నటనకు అలీ నుంచి అమితాబ్ బచ్చన్ వరకు అభిమానులుగా మారారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన స్థానం చిరస్థాయిగా ఉంటుంది.