కృష్ణాజిల్లా గన్నవరంలో ప్రజావ్యతిరేక, నిరంకుశ,మతోన్మాద బిజెపిని సాగనంపుదాం- దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో సిపిఐ-సిపిఐ ప్రచార భేరి బహిరంగ సభ నిర్వహించింది. హాజరైన సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ..రాఘవులు, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ పాలనపై మండిపడ్డారు. దేశంలో బిజేపి కేంద్రంలో, ఇక్కడ వైసిపి పాలన చేస్తుంది..దేశం చాలా ప్రమాదకరమైన పరిస్దితిలో ఉంది, రాష్ట్రంలోను పరిస్థితి బాగోలేదు..దేశంలో బిజేపి బలంగా ఉంది, కేంద్రంలో అధికారంలో బిజేపి ఉంది..మరోసారి అధికారంలోకి రావాలని బిజేపి చూస్తుంది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఉన్న విమానాశ్రయాలు ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంది.
Read Also: Lover Atrocity: ప్రేమను ఒప్పకోలేదని.. గదిలో బంధించి చిత్రహింసలు
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ – ఆంద్రుల హక్కు అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు సంస్థలకు అమ్మాలని మోడి చూస్తున్నాడు..రాష్ట్రంలో ప్రభుత్వాలకు అడిగే హక్కు లేదు.. వారి చుట్టు తిరిగి మేతుకులు తేచ్చుకుంటుంది..కేంద్రంపై ఆనాడు ఎన్టీఆర్ ఎదురు తిరిగినందుకు సిఎం నుండి తప్పించారు.. నేడు వైసిపి కేంద్రం కాళ్లు మొక్కుతుంది..రైల్వే స్టేషన్లు, పరిశ్రమలు, విమానాశ్రయాలు అమ్మాలని మోడి చూస్తున్నాడు..విజయవాడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నాడు..రాష్ట్రంలో మత్తు పదార్దాల నుండి దూరంగా ఉండాలని ప్రచారాలు చేస్తున్నారు ఉద్యోగాలు లేకపోతే యువత అసాంఘిక కార్యకలాపాలకు అలవాటు పడుతున్నారు..వైఎస్ వివేకానందా బ్రతికినపుడు పాపులర్ కాలేదు చణిపోయాకా ఇప్పుడు బాగా పాపులర్ అయ్యాడు..
ఏలాగా చణిపోయాడో అందరికి తెలుసు.. కడపలో టికొట్టు వాడిని అడిగిన చెబుతాడు..నాలుగేళ్ళు అయినా ఐపిఎస్ లు కనిపెట్టాలేదు.. సిగ్గుండాలి..మీ చిన్నాన్నను హత్య చేసిన వాడిని పట్టుకోలేదు పోయావు ఇంకా ఎందుకు గాడిదలు కాయడానికా ? జగన్ కేసులు , అతని కుటుంబ కేసులు వల్లన కేంద్రంపై మాట్లాడలేడు. పవన్ కల్యాణ్ ముందు బాగానే మాట్లాడాడు.. పాచిపోయిన లడ్డు అన్నాడు.. ఇప్పుడు ఏం మాట్లాడటం లేదు ఎందుకు? బీజేపీ వాళ్లే పవన్ ను నమ్మడం లేదని చెబుతున్నారు. పవన్ బయటకు రావాలన్నారు సీపీఐ, సీపీఎం నేతలు.
Read Also: Heart Transplantation: శ్రీకాకుళం టు తిరుపతి.. గుండె తరలింపు